AP Government Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు....!!1
ఏపీలో(Andhra Pradesh) వైద్యఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాల(Jobs) భర్తీకి సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని టీచింగ్ హాస్పటల్స్, ఇతర ఆస్పత్రుల్లో మొత్తం 11,425 ఖాళీలను(Jobs) భర్తీకి ఇటీవల జగన్ (AP CM Jagan) సర్కార్ ఆమోదం తెలిపింది. వైద్యుల నియామకానికి సంబంధించిన ఆయా శాఖాధిపతుల నుంచి నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇతర పోస్టుల(Jobs) భర్తీకి కలెక్టర్ల ఆధ్వర్యంలో నోటిఫికేషన్లు(Notification) విడుదల కానున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ల జారీ, నియామకాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో అధికారులు సమీక్ష నిర్వహించారు. అయితే ఆయా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు (Job Notifications) శనివారం అంటే నవంబర్ 20 నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ (AP Government) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) లో 2,190 కొత్త ఉద్యోగాలను మంజూరు చేసింది. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న 1,952 ఖాళీల భర్తీకి సైతం సర్కార్ (AP Government) ఓకే చెప్పింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర కీలక ఉత్తర్వులు జారీ చేశారు. 2,190 కొత్త ఉద్యోగాల్లో 51 ప్రొఫెసర్ పోస్టులు, 187 అసోసియేట్ ప్రొఫెసర్లు, 130 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 1,040 స్టాఫ్ నర్సు పోస్టులు, 782 పారా మెడికల్ సిబ్బంది పోస్టులు ఉన్నాయి.
రాష్ట్రంలోని మొత్తం 11 మెడికల్ కాలేజీల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంకా ప్రభుత్వం మరో 1,952 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో 282 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 430 మంది స్టాఫ్ నర్సులతో పాటు టీచింగ్ హాస్పటల్స్ లో అవసరమైన ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలకు సంబంధించి త్వరలోనే ప్రకటనలు (Job Notifications) విడుదలయ్యే అవకాశం ఉంది.
No comments