Latest

Loading...

AP News జగనన్న సంపూర్ణ గృహ హక్కు స్కీంపై జగన్‌ కీలక ఆదేశాలు....52 లక్షల మందికి లబ్ది...!!

AP News

 జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంపై ముఖ్యమంత్రి జగన్‌ ఇవాళ సమీక్ష నిర్వహించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులకు క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ ఉండాలని ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.



దీని కోసం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని… దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి జాప్యం లేకుండా అప్రూవల్స్‌ ఇవ్వాలని తెలిపారు.


క్షేత్రస్థాయిలో ఎంక్వైరీలు కూడా.. నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తి చేయాలని తెలిపారు. ఆస్తులపై పూర్తి హక్కులు దఖలు పడతాయన్న అవగాహన లబ్ధిదారులకు కల్పించాలన్నారు సీఎం జగన్. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని… గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ కావాలని ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ నవంబర్‌ 20 నుంచి ప్రారంభం కానున్నట్లు… డిసెంబర్‌ 15 వరకూ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరుగుందన్నారు సీఎం జగన్. ఈ పథకం ద్వారా ఏకంగా 52 లక్షల మందికి లబ్ది చేకూరుననున్నట్లు స్పస్టం చేశారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.


No comments

Powered by Blogger.