Latest

Loading...

AP News తిరుపతి పర్యటనకు ఏపీ సీఎం జగన్..!!

AP News

 ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ రెండు రోజుల నిమిత్తం తిరుపతి పర్యటనకు వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు గన్నవరం నుంచి రేణిగుంటకు బయల్దేరి వెళ్తారు.


రాత్రి 7 గంటల ప్రాంతంలో రేణిగుంటకు చేరుకునే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు జగన్‌ స్వాగతం పలుకుతారు. అనంతరం అక్కడి నుంచి తిరుమల బయలుదేరి వెళతారు. రాత్రి 9.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు, ఆ తర్వాత రాత్రి రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. రేపు మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుపతి బయలుదేరుతారు, మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు


No comments

Powered by Blogger.