Latest

Loading...

AP News నా ఇంట్లో బాత్ రూమ్ ఉన్నట్టు ఉండాలి,....అక్కడ కలెక్టర్ భోజనం చేయాలి...జగన్ కీలక ఆదేశాలు...!

AP News

 మన ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటామో.. పిల్లలు చదివే పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు అలాగే ఉండాలని ఏపీ సిఎం వైఎస్ జగన్ స్పష్టం చేసారు.



నేడు విద్యాశాఖ మీద సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్ పలు కీలక ఆదేశాలు ఇచ్చారు అధికారులు. మరుగు దొడ్ల గురించి మాట్లాడుతూ నాణ్యమైన సదుపాయాలు అన్నది అందరి లక్ష్యం కావాలని అన్నారు ఆయన. అందుకనే పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై తనిఖీలు చేయాలని స్పష్టం చేసారు .


టాయిలెట్స్‌లో ట్యాప్‌లు పనిచేయక, నీళ్లు రాక... అవి చివరకు దుర్గంధంతో నిండిపోయి ఎవరూ వినియోగించని పరిస్థితులు చూశామని సిఎం అన్నారు. అలాంటి పరిస్థితులను నాడు - నేడు ద్వారా మార్చాం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. ఇప్పడు వాటిని సరిగ్గా పర్యవేక్షించి పిల్లలకు మంచి వాతావరణం అందుబాటులో ఉండాలి అని అన్నారు ఆయన. పాఠశాలలకు హెడ్‌మాస్టర్లు కుటుంబ పెద్దలు అని ఆ పాఠశాలల్లో నాణ్యమైనరీతిలో బోధన దగ్గరనుంచి మొదలు భోజనం నుంచి ఇతర సదుపాయాలు, మౌలిక వసతులపై తనిఖీలు చేసి... వాటిని సవ్యంగా ఉండేలా వారుచూడాలని, ఆవిధంగా హెడ్మాస్టర్లను చైతన్యం చేయాలని స్పష్టం చేసారు.


ప్రతిరోజూ మానిటరింగ్‌ జరగాలన్న సీఎం.. గోరుముద్దపై కూడా ఫీడ్‌ బ్యాక్‌ నిర్వహించారు. గోరుముద్దపై క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. పిల్లలనుంచి, తల్లులనుంచి తప్పకుండా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, జేసీలు, అధికారులు తప్పనిసరిగా గోరుముద్ద అమలును పర్యవేక్షించాలని తెలిపారు. స్వయంగా వారు భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌ను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలన్న సీఎం.. ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, వాటిని ఇతరులకు నేర్పించడం లాంటి కాన్సెప్ట్‌ను పిల్లలకు నేర్పించాలి అని స్పష్టం చేసారు.


No comments

Powered by Blogger.