Latest

Loading...

AP News ఫించను రద్దయిన వారికి తీపి కబురు తెలిపిన జగన్ సర్కార్....!!

AP News

 వివిధ కారణాలతో ఫించను రద్దయిన వారికి జగన్ సర్కార్ తీపి కబురు అందించింది. తమ ఫించన్లను అకారణంగా రద్దు చేశారని.. నవశకం సర్వేలో తమను అనర్హులుగా గుర్తించి రద్దు చేశారని..


అన్ని అర్హతలున్న తమకు ఫించను పునరుద్ధరించాలంటూ.. అనేక మంది ప్రతి సోమవారం జరిగే 'స్పందన' కార్యక్రమంలో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో సర్కార్ ఆలా రద్దైన వారు మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.


సచివాలయ పోర్టల్ లో తిరస్కరణకు గురైన వారికి కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించింది ప్రభుత్వం. అలాగే శఆశ్వతంగా వలస వెళ్లినవారు, నవశకం సర్వేలో అనర్హులుగా గుర్తించిన వారు అర్హులై ఉంటే తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులతో అర్హులైన వారి ఆధార్ కార్డుల ఆధారంగా అర్హతలను మళ్లీ పరిశీలించాలంటూ ఉత్తర్వులిచ్చింది.

No comments

Powered by Blogger.