Latest

Loading...

AP News దీపావళి పండగ వేళ.....ఏపీలో ప్రభుత్వ టీచర్లకు షాక్...!!.

AP News

 దీపావళి పండగ వేళ ఏపీలో ప్రభుత్వ టీచర్లకు ప్రభుత్వం షాకిచ్చింది. ఇప్పటికే ఏపీలో టీచర్లు పని ఒత్తిడి ఎక్కువైపోతోందంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కొత్తగా టీచర్ల పనితీరు మదింపు చేయాలని అధికారులు నిర్ణయించారు.


ప్రభుత్వ టీచర్లు, హెడ్ మాస్టార్ల పనితీరును మదింపు చేసి.. గ్రేడ్ల వారీగా వివరాలను నమోదు చేసేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో టీచర్లకు కష్టాలు మొదలైనట్టేనని తెలుస్తోంది. ఎక్కడా లేని విధంగా ఈ టీచర్ల పనితీరు మదింపు ఏమిటని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఉపాధ్యాయుల పనితీరు మదింపు ప్రక్రియకు "అకడమిక్ పర్ఫార్మెన్స్" గా ప్రభుత్వం పేరు పెట్టింది. అసలు ఉపాధ్యాయులు ఎలా పాఠాలు చెబుతున్నారు..? ఇప్పటివరకూ ఎంత సబ్జెక్టు భోదించారు..? డ్రాపవుట్స్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. ఇలాంటి వివరాలన్నింటినీ నమోదు చేస్తారు. దాదాపుగా 15 ప్రశ్నలతో ఉపాధ్యాయుల పనితీరును అంచనా వేస్తారు. విద్యార్థులకు పరీక్షలలో వచ్చే మార్కుల ప్రాతిపదికన ఉపాధ్యాయుల పనితీరును మదింపు చేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్ వేర్ ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. పూర్తి పారదర్శకతతో ఈ సాఫ్ట్ వేర్ లో గ్రేడ్లు నిర్ణయిస్తామని చెబుతున్నారు అధికారులు.


ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు పేరుతో అభివృద్ధి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం కోట్ల రూపాయలను కూడా వెచ్చిస్తోంది. నూతన పాఠశాల భవనాల నిర్మాణంతో పాటూ.. విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులను కూడా కల్పిస్తోంది. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటూ పని చేస్తున్నారు. మరోవైపున మధ్యాహ్నం వేళల్లో రుచికరమైన భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్, షూస్, బుక్, బాగ్స్ ఇలా అన్నీ ఉచితంగా అందిస్తూ విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ పనులన్నీ సక్రమంగా విద్యార్థులకు చేరేలా చూసేది మాత్రం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే.. అసలే ప్రభుత్వం కేటాయించిన పనులను పూర్తి చేసేందుకు తాము అష్టకష్టాలు పడుతుంటే.. ఇప్పుడిలా పనితీరు మదింపు చేస్తామనడం ఎంతవరకూ సమంజసమని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.


No comments

Powered by Blogger.