AP News ఏపీ ఎయిడెడ్ సంస్థలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.....!!!
ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థల పై రాజకీయ దుమారం రేగుతుంది. ఎయిడెడ్ సంస్థలను ప్రభుత్వం రద్దు చేస్తోందంటూ విపక్షాలతో పాటు విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.ఈ నేపథ్యంలో నేడు ఏపీ విద్యారంగంపై సీఎం జగన్ సమీక్ష జరిపారు.
సమీక్షలో జాతీయ విద్యా విధానం, అమలుపై చర్చించారు. ఏపీ రాష్ట్రంలో 2,663 ప్రాధమికోన్నత పాఠశాలలను హైస్కూళ్ళలో విలీనం చేశామని అధికారులు తెలిపారు. విలీనం చేసినా దాతల పేర్లు కొనసాగిస్తామని జగన్ సీఎం పేర్కొన్నారు. ఇంకా ఏపీ లో ఎయిడెడ్ సంస్థలు యథావిధిగా నడుపుకోవచ్చని సీఎం జగన్ తెలిపారు.
No comments