AP Rain Alert ఏపీకి పొంచిఉన్న మరో ముప్పు....!!
మొన్నటి వరకు కురిసిన వర్షాలతోనే ఏపీలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాలు వరద నీటిలోనే చిక్కుకున్నాయి. అంతేకాకుండా భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లి కొన్ని గ్రామాలను నేలమట్టం చేశాయి.
చెరువులకు గండ్లు పడడంతో 39 మంది గల్లంతయ్యారు. వారిలో 27 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగితా వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఏపీకి మరో ముప్పు పొంచిఉందని వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో మరోసారి తిరుపతి, నెల్లూరు నగరాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సుమారు 13 సెం.మీ వర్షపాతం నమోదు కావొచ్చని వాతావరణ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు.
No comments