Latest

Loading...

AP Weather Alert: ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం....!!!

AP Weather Alert

 AP Weather Alert: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాలతో పాటు కొన్ని పరీవాహక ప్రాంతాల్లో మరో 24గంటల పాటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారతదేశం వాతావరణ విభాగం హెచ్చరించింది.


భారీ నుంచి అతిభారీ వర్షాలతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఈ అతిభారీ వర్షాల కారణం నదులు పొంగి వరదలు ముంచెత్తితే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం నైరుతి మరియు పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది వాయువ్య దిశగా పయనించి గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య చెన్నై సమీపంలో తీరం దాటిందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో రేపు కుడా కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.


రాష్ట్రంలో భారీ వర్షాలు నేపథ్యంలో సీఎం జగన్ అధికారులకు పలు సూచనలు చేశారని కన్నబాబు చెప్పారు. అంతేకాదు ముఖ్యమంత్రి సూచనలను అనుసరించి భారీవర్షాల నేపధ్యంలో ఎప్పటికప్పుడు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. అత్యవసర సహాయక చర్యలకోసం చిత్తూరు జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను, నెల్లూరుజిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందం పంపించామని తెలియజేశారు.


అయితే మరోవైపు శనివారం అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని .. అది ఈ నెల 17న దక్షిణకోస్తాంధ్ర వద్ద తీరందాటే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనా అని చెప్పారు. దీంతో ఏపీలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అంతేకాదు రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కన్నబాబు సూచించారు.

No comments

Powered by Blogger.