Latest

Loading...

క్యాన్సర్ రిస్క్ మొదలు బీపీ వరకు యాపిల్ తో ఎన్నో ఉపయోగాలు..!

Apples Benefits

 ఆపిల్ ఎన్నో అనారోగ్య సమస్యలను దరిచేరకుండా చూసుకుంటుంది. ఆపిల్ ని రోజు తినడం వల్ల డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు. ఆపిల్ వల్ల నిజంగా చాలా లాభాలు ఉన్నాయి.


అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆపిల్ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ మొదలైన పదార్ధాలు ఉంటాయి. ఇది చాలా అనారోగ్య సమస్యలని తరిమి కొట్టడానికి మనకు సహాయం చేస్తుంది.


క్యాన్సర్ రిస్క్ ఉండదు:


ఆపిల్ లో విటమిన్ సి, విటమిన్ ఏ మొదలైన పదార్థాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్, అబ్డామినల్ క్యాన్సర్, ఇంటెస్టినల్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి సమస్యల రిస్క్ తగ్గుతుంది.


కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి:


ఆపిల్ లో డైటరీ ఫైబర్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి పోకుండా ఉంటాయి. హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్ లాంటి సమస్యల నుండి కూడా దూరంగా ఉండొచ్చు.


బీపీ తగ్గుతుంది:


ఆపిల్ తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ లేదా హైబీపీ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. ఆపిల్ లో ఉండే పొటాషియం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి. ఇర్ రెగ్యులర్ హార్ట్ బీట్ లాంటి సమస్యలని తగ్గిస్తుంది.


కార్డియోవాస్క్యులర్ హెల్త్ కి మంచిది:


ఆపిల్ తీసుకోవడం వల్ల కార్డియోవాస్క్యులర్ హెల్త్ కు చాలా మంచిది. ఇందులో విటమిన్ సి విటమిన్ ఎ మరియు ఇతర పదార్థాలు ఉంటాయి. ఇవి కార్డియోవాస్క్యులర్ సమస్యలు రాకుండా చూసుకుంటాయి.


న్యూరోలాజికల్ హెల్త్ కి da:


మెదడు ఆరోగ్యానికి ఆపిల్ బాగా సహాయం చేస్తుంది. ఆమ్నీషియా, డిమెన్షియా మొదలైన సమస్యలు నుండి కూడా బయట పడవచ్చు.

No comments

Powered by Blogger.