Latest

Loading...

Bank Holidays in December : డిసెంబర్‌లో బ్యాంకు సెలవులెన్నంటే....!!

Bank Holidays in December

 Bank Holidays in December | ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ బ్యాంకు లావాదేవీలు తప్పనిసరిగా మారింది. అయితే, బ్యాంకు ఉద్యోగులకు కూడా సెలవులు ఉంటాయి.


ప్రతి నెలా నాలుగు ఆదివారాలు, రెండు (రెండవ, నాల్గవ) శనివారాలు సాధారణ సెలవులు. వాటితోపాటు వివిధ పండుగలు, జాతీయ దినోత్సవాల సందర్భంగా బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) సెలవులు ఖరారు చేస్తుంది. ఈ మేరకు హాలీడే క్యాలెండర్ విడుదల చేస్తుంది.


తెలుగు రాష్ట్రాల్లో 6 రోజుల సెలవులు


దీని ప్రకారం డిసెంబర్‌లో బ్యాంకుల ఉద్యోగులకు 12 రోజుల సెలవులు వస్తాయి. అయితే, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుగలు, వేడుకలను బట్టి ఆయా ప్రాంతాల్లో మాత్రమే సెలవులు ఉంటాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజులు మాత్రమే సెలవులున్నాయి. కనుక బ్యాంకు ఖాతాదారులు తమ బ్యాంక్ శాఖకు వెళ్లేముందు ఒకసారి ఆర్బీఐ హాలీడే క్యాలెండర్ సరి చూసుకుంటే బెటర్‌గా ఉంటుంది మరి..డిసెంబర్ నెలలో సెలవుల వివరాలు ఓ సారి చూద్దాం..


డిసెంబర్‌లో బ్యాంకులకు ఇలా సెలవులు


డిసెంబర్ 5 (ఆదివారం), 11 (రెండో శనివారం), 12 (ఆదివారం), 19 (ఆదివారం), 25 (క్రిస్మస్‌-నాలుగో శనివారం), 26 (ఆదివారం) సాధారణ సెలవులు. ఇక డిసెంబర్ మూడవ తేదీన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ కోసం పనాజీలో బ్యాంకులకు సెలవు. 18న యుసోసోథామ్ వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్‌లో బ్యాంకులు పని చేయవు. 24, 27తేదీల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఐజ్వాల్‌లో బ్యాంక్ హాలీడే. 31న న్యూఇయర్ వేడుక కోసం ఐజ్వాల్‌లో బ్యాంకులు పని చేయవు

No comments

Powered by Blogger.