Chips Packet చిప్స్ ప్యాకెట్ లో సగం గాలి ఉంటుంది.... అలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా....?
పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ చిప్స్ ప్యాకెట్లను ఎక్కువగా ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. చూడటానికి పెద్ద సైజ్ లో కనిపించే చిప్స్ ప్యాకెట్ లో గాలి ఎక్కువగా ఉంటుంది.
అయితే చిప్స్ ప్యాకెట్ లో గాలి నింపడానికి సరైన కారణం మాత్రం చాలామందికి తెలియదు. చిన్నపిల్లలు అయితే చిప్స్ ప్యాకెట్ లో కొన్ని చిప్స్ మాత్రమే ఉంటాయని బాధ పడుతూ ఉంటారు.
అయితే ఈ చిప్స్ ప్యాకెట్ లో నైట్రోజన్ వాయువును నింపడం జరుగుతుంది. ఎక్కడో తయారైన చిప్స్ ప్యాకెట్లను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్ పోర్ట్ చేయడం జరుగుతుంది. చిప్స్ లో నైట్రోజన్ వాయువును నింపని పక్షంలో చిప్స్ ముక్కలుముక్కలుగా విరిగిపోయే అవకాశం ఉండటంతో పాటు ముక్కలుముక్కలు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ విధంగా జరగకుండా ఉండాలనే కారణంతో చిప్స్ ప్యాకెట్ లో గాలిని నింపడం జరుగుతుంది.
సాధారణంగా చిప్స్ ను ఆయిల్ తో తయారు చేయడం జరుగుతుంది. ఆయిల్ తో తయారు చేసిన వస్తువులు త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. నైట్రోజన్ గ్యాస్ ఆహారాలను పాడు కాకుండా చేస్తుంది కాబట్టి చిప్స్ ప్యాకెట్లలో సగం వరకు గాలి మాత్రమే ఉంటుంది. కంపెనీలు గాలిని నింపి ప్యాకెట్ ను పెద్దగా కనిపించేలా చేస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ చిప్స్ ప్యాకెట్లలో గాలిని నింపడానికి అసలు రీజన్ మాత్రం ఇదేనని చెప్పవచ్చు.
మరోవైపు ఆరోగ్య నిపుణులు చిప్స్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావని చెబుతున్నారు. ఎవరైతే మంచి ఆరోగ్యాన్ని కోరుకుంటారో వాళ్లు చిప్స్ ను తినకపోవడమే మంచిదని చెప్పవచ్చు.
No comments