Covid tests పిల్లలకు కొవిడ్ టెస్టులు అవసరం లేదు...!!
అంతర్జాతీయ ప్రయాణికుల ఆగమనానికి సంబంధించి దేశంలో కొవిడ్ నిబంధనలను కొద్దిగా సవరించారు
ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది. దీని మేరకు ఐదేళ్ల లోపు పిల్లలకు విదేశీ ప్రయాణాలకు వెళ్లేముందు, వచ్చిన తరువాత కొవిడ్ పరీక్షల అవసరం ఉండదు. పెద్దలతో పాటు ఉండే ఐదేళ్లలోపు పిల్లలు ఎటువంటి పరీక్షలు లేకుండానే వెళ్లవచ్చు. అయితే క్వారంటైన్ దశలో లేదా వారు ఇక్కడికి వచ్చినప్పుడు కరోనా వైరస్ లక్షణాలు ఉంటే వెంటనే సంబంధిత కొవిడ్ గైడ్‌లైన్స్ పరిధిలో పరీక్షలకు గురికావల్సి ఉంటుంది.
అంతర్జాతీయ స్థాయిలో వైరస్ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వస్తోంది. ఈ విధంగా ఏకంగా నిర్థిష్ట ప్రాంతీయ స్థాయిల్లో హెచ్చుతగ్గుల క్రమంలో కరోనా ఉనికి ఉంది. అంతర్జాతీయ పర్యాటకులపై ఇటీవలే అమెరికా ఆంక్షలను ఎత్తివేసింది. ఈ క్రమంలో భారతదేశం నుంచి కుటుంబాలతో పాటు వెళ్లే పిల్లలపై కూడా టెస్టులు తప్పనిసరి అనే నిబంధనలు ఇంతవరకూ ఉన్నాయి. అయితే పలు వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు పిల్లలకు టెస్టులు ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుని ఇందుకు అనుగుణంగా తాజా మార్గదర్శకాలను వెలువరించారు.
No comments