Latest

Loading...

Dates Milk Health benefits 7 రోజులు తీసుకుంటే 100 ఏళ్ళు వచ్చిన నరాల బలహీనత,కీళ్ల నొప్పులు,రక్తహీనత,ఒంటి నొప్పులు అనేవి ఉండవు...!!

Dates Milk Health benefits

 Dates Milk Health benefits : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు.


ఇప్పుడు కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలను తగ్గించుకోవటానికి పాలను తయారుచేసుకుందాం. కాస్త ఓపికగా ఈ పాలను తయారుచేసుకొని తాగితే మంచి ఫలితం కనపడుతుంది.


ముందుగా 10 ఖర్జూరాలు, 10 బాదం పప్పులను నీటిలో రాత్రి సమయంలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఖర్జూరాలలో గింజలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నానిన బాదం పప్పు తొక్కలను తీసేయాలి. ఖర్జూరం,బాదం పప్పులను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేసుకోవాలి.


ఈ పేస్ట్ ని ఫ్రిజ్ లో పెడితే దాదాపుగా వారం రోజులు నిల్వ ఉంటుంది. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పెట్టి కాస్త వేడి అయ్యాక ఒక స్పూన్ ఖర్జూరం,బాదం పేస్ట్ ని వేసి ఒక నిమిషం మరిగించాలి. ఆ తర్వాత పావు స్పూన్ పసుపు, చిన్న దాల్చిన చెక్క ముక్క, చిన్న బెల్లం ముక్క వేసి 3 నిమిషాల పాటు మరిగించాలి.


మరిగిన పాలను గ్లాస్ లో పోసుకొని తాగాలి. ఈ విధంగా ఈ పాలను వారం రోజులు తాగాలి. ఆ తర్వాత ఒక వారం గ్యాప్ ఇచ్చి మరల వారం రోజులు తాగాలి. ఈ విధంగా ఈ పాలను తాగుతూ ఉంటే కీళ్లనొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రక్తహీనత వంటివి ఏమి ఉండవు. అలాగే నరాల బలహీనత సమస్య ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనం కనపడుతుంది. కాస్త ఓపికగా ఈ పాలను తాగితే మంచి ఫలితాన్ని పొందుతారు.

No comments

Powered by Blogger.