Latest

Loading...

Diwali good News గుడ్ న్యూస్.. రేపు కూడా సెలవే...?

Diwali good News

 దీపావళి పండుగ వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరూ ఎంత ఘనంగా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని భావిస్తూ ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజుల ముందు నుంచి దీపావళి పండుగ అంగ రంగ వైభవంగా చేసుకోవడానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు.


ఇలా దీపావళి పండుగ వచ్చిందంటే చాలు ఊరూవాడా మొత్తం దీపాల కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇక ఈ దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ప్రతి ఒక్కరు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ టపాసులు కాలుస్తూ ఇక ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు.


కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా హిందువులందరూ కూడా జరుపుకొనే అతి పెద్ద పండుగ లో దీపావళి పండుగ కూడా ఒకటి అయితే సాధారణంగా దీపావళి పండుగ రోజు ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాదు అటు ప్రైవేటు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. ఇక సాధారణంగా అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఏ చిన్న పండుగ వచ్చిన ప్రభుత్వం నుంచి సెలవులు లభిస్తూ ఉంటుంది. అయితే ఈ దీపావళి పండగ నాడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ సెలవు లభించింది. అయితే ఈ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు అటు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.


ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అందరికీ కూడా దీపావళి సందర్భంగా ఒక శుభవార్త చెప్పింది జగన్ ప్రభుత్వం దీపావళి రోజు మాత్రమే కాదు దీపావళి మరుసటి రోజు కూడా ఆప్షనల్ హాలిడే గా ప్రకటిస్తూ ఇటీవలే జగన్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు కేవలం దీపావళి రోజు మాత్రమే సెలవు ఉండేది. కానీ ఇప్పుడు దీనికి అదనంగా మరో రోజు కూడా సెలవు జాబితాలో చేరుస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కూడా ఈ సెలవు దినం వర్తిస్తుంది అంటూ ఇటీవల ప్రకటించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


No comments

Powered by Blogger.