Latest

Loading...

Diwali Laxmi Puja : ఈ ఏడాది దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజకు సరైన ముహూర్తం ఇదే....!!

Diwali Laxmi Puja

 Diwali Laxmi Puja : హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక మాస అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాలలో ఈ పండుగను ఐదు రోజులపాటు ఎంతో వేడుకగా జరుపుకుంటారు.


మరి కొందరు ధన త్రయోదశి నుంచి ఈ పండుగను మూడు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 4వ తేదీ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.


చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఈ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగ రోజు సాయంత్రం లక్ష్మీదేవికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది అమ్మవారికి పూజ చేయడానికి సరైన సమయం ఏది అనే విషయానికి వస్తే.. సాయంత్రం అమ్మవారికి పూజ చేయడానికి 3:18 నిమిషాల నుండి రాత్రి 10:30 నిమిషాల వరకు మంచి సమయం ఉంది. శ్రీ ధనలక్ష్మి అమ్మవారికి ఆ సమయంలో విశేషపూజలు చేయవచ్చు.


అయితే దీపావళి పండుగ రోజు చాలామంది నోములు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొత్తగా నోములు చేసే వారికి దీపావళి ఎంతో మంచిదని, కొత్తగా నోములు చేసేవారు పలు కారణాల వల్ల నోములను మానేసిన వారు తిరిగి చేసుకోవాలన్నా ఈ పండుగ రోజు చేయడం ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.


దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ చేయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు. దీంతో సకల శుభాలు కలుగుతాయని, సంపద సిద్ధిస్తుందని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని అంటున్నారు.


No comments

Powered by Blogger.