Latest

Loading...

Flipkart ఫ్లిప్‌కార్ట్ లో అదిరే ఆఫర్లు...ఫ్రీగా వెండి కాయిన్స్ కూడా....!!

Flipkart

ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. అదిరిపోయే సేల్ తో ముందుకు రావడం ఫ్లిప్ కార్ట్ కి కొత్తేమి కాదు. దేశీ దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ మరో అదిరిపోయే సేల్‌ తో కస్టమర్స్ ముందుకి వస్తోంది.


దీనితో కస్టమర్స్ ఆఫర్స్ ని పొంది డబ్బులని సేవ్ చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..


దేశీ దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్ అదిరే సేల్ ని ఒకటి తీసుకు రావడం జరిగింది. బిగ్ బచత్ ధమాల్ పేరు తో కొత్త ఆఫర్ సేల్ ని తీసుకొచ్చారు. దీనిలో భాగంగా కస్టమర్లు పలు రకాల ఆకర్షణీయ డీల్స్ ని పొందొచ్చు అని ఫ్లిప్ కార్ట్ అంటోంది. అయితే ఈ బిగ్ బచత్ ధమాల్ సేల్ నవంబర్ 19 నుంచి స్టార్ట్ అవ్వనుంది.


ఉచిత డెలివరీ, తక్కువ ధరలు, ఈజీ రిటర్న్ వంటి ప్రయోజనాలు ఈ బిగ్ బచత్ ధమాల్ సేల్ ద్వారా పొందొచ్చు. అదే విధంగా పేటీఎం కస్టమర్లకు రూ.50 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ పేటీఎం వాలెట్ లేదా యూపీఐ లావాదేవీలకు పని చేస్తుంది. అలానే వెండి కాయిన్స్ ని పొందే అవకాశం కూడా వుంది. ప్రతి గంట తొలి 50 మంది కస్టమర్లకు సిల్వర్ కాయిన్స్ ని ఫ్రీ గా ఇవ్వనున్నారు. ధమాల్ డీల్స్, లూట్ బజార్, కాంబో డీల్స్ వంటివి కూడా వున్నాయి.


No comments

Powered by Blogger.