Ghee: చలికాలంలో నెయ్యితో..... పొందండి వెయ్యి లాభాలు....!!
Ghee: చలికాలం వస్తు వస్తూనే అనేక ఆరోగ్య సమస్యలను మూటగట్టుకు వస్తుంది.. ఈ కాలంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నవారైన సరే జలుబు, దగ్గు, చర్మ సమస్యల బారిన పడాల్సిందే..
ఈ సమస్యలను ఎదుర్కోవాలంటే ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి.. శీతాకాలంలో నెయ్యి ఎక్కువగా తీసుకోవటం వలన మన ఆరోగ్యానికి బోలెడు మేలు చేస్తుంది.. ఈ సీజన్ లో నెయ్యి తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో ఇప్పుడు చూద్దాం..!!
Ghee: వేడి వేడి అన్నంలో నెయ్యి కలుపుకుని తింటే..!!
నెయ్యిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్నాయి. ఇవి ఈ కాలంలో వచ్చే ఫ్లూ, వైరస్ లను ఎదుర్కొనడానికి సిద్ధంగా మన దేహాన్ని ఉంచుతుంది. ఏ సీజన్లో జలుబు, దగ్గు తరచుగా వ్యాపిస్తుంది. ప్రతిరోజూ నెయ్యి మీ ఆహారంలో భాగం చేసుకోవడం వలన ఈ సమస్యలు రాకుండా చేస్తుంది. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. మనం భోజనం చేసే వేడి వేడి అన్నంలో నెయ్యి కలిపి తీసుకోవడం వలన శరీరంలో వేడి పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత పెరగడంతో చలి లేకుండా ఉంటుంది.
ఉదయం పరగడుపున అరచేతిలో నెయ్యి వేసుకుని తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నాడీవ్యవస్థ చురుకుగా ఉంచుతుంది. అల్జీమర్స్ సమస్యలు తగ్గిస్తుంది. ఏ సీజన్లో వచ్చే శ్వాస సమస్యలతో పాటు ఇతర వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా ఉంచుతుంది. మీరు రోజూ తినే ఆహారాలలో కొద్దిగా కలుపుకొని తింటే పోషక విలువలు శరీరానికి అందిస్తాయి. దీంతో రోజంతా యాక్టివ్ గా ఉంటారు. జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో చెంచా నెయ్యి కలిపి తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. పేగులలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా తొలగిస్తుంది.
చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా బాధిస్తాయి. ఇవి తగ్గాలంటే నెయ్యి, పెరుగు, నిమ్మరసం సమాన మోతాదులో కలిపి శరీరానికి రాసి ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే చర్మ సమస్యలు బాధించవు. చర్మం పొడిబారకుండా మృదువుగా ఉంచుతుంది. చర్మం పొడిబారినట్లు లేదా పగిలినట్టు ఉంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి లో చిటికెడు పసుపు రాసి ఈ సమస్య ఉన్న చోట రాస్తే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
No comments