Latest

Loading...

Ginger Tea Side Effects: అల్లం టీ తాగేవారికి షాకింగ్ న్యూస్.. రోజూ తీసుకుంటే ప్రమాదమే.....!!

Ginger Tea Side Effects

 సాధారణంగా చాయ్ తాగే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. ఒత్తిడి.. పనిభారం నుంచి ఉపశమనం పొందడానికి ఒక కప్పు టీ తాగేవారు అధికం. అలా కాకుండా రోజులో ఎక్కువ సార్లు టీ తాగేవారు కూడా లేకపోలేదు.


తులసి టీ, అల్లం టీ, ఇలాచీ టీ, మాసాలా టీ, ఫెన్నెల్ టీ, లైకోరైస్ టీ ఇలా ఎన్నో రకాల టీలు మన దేశంలో లభిస్తాయి. అయితే చలికాలంలో అల్లం టీని ఎక్కువగా తాగుతుంటారు. అల్లం టీ ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. తలనొప్పి తగ్గించి మానసిక ప్రశాంతత అందిస్తుంది. అయితే అల్లం టీ తీసుకోవడం వలన కూడా అనేక ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల మెడికల్ న్యూస్టుడే నివేధిక ప్రకారం అల్లం టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. కానీ ఎక్కువగా తీసుకుంటే ప్రమాదాన్ని కూడా కలిగిస్తుందట.


అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. కానీ అల్లంను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానీ కలిగే అవకాశం ఉంది. అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే కడుపు సమస్యలు పెరుగుతాయి. మరోవైపు అల్లం టీని ఎక్కువగా తీసుకోవడం వలన గ్యాస్ సమస్య పెరుగుతుంది. అలాగే శరీరానికి విశ్రాంతి లేమి సమస్య పెరుగుతుంది. అలాగే అల్లం టీని ఎక్కువగా తాగడం ద్వారా తల తిరగడం, బలహీనంగా మారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా.. అల్లం టీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. అల్లంలో ఉండే జింజెరాల్ అనే మూలకం జుట్టు పెరుగుదలను నిరోధిస్తుంది. దీంతో జుట్టు రాలే సమస్య తీవ్రమవుతుంది.


అల్లం టీని ఎక్కువగా తాగడం వలన ఎసిటిడీ సమస్య పెరుగుతుంది. కడుపులో మంట సమస్య కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే జింజెరాల్ కడుపులో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ సందర్భంలో అల్లం టీ తీసుకోవడం తగ్గించాలి. ఇక ముఖ్యంగా అల్లం టీని ఎక్కువగా తీసుకుంటే నిద్రలేమి సమస్యలు పెరుగుతాయి. దీంతో శరీరం తొందరగా అలసిపోతుంది. బలహీనత కూడా పెరుగుతుంది. రాత్రి సమయంలో అల్లం టీ అస్సలు తీసుకోవద్దు.

No comments

Powered by Blogger.