Latest

Loading...

Good News ఉద్యోగులకు కేసీఆర్‌ సర్కార్‌ శుభవార్త......వారికి పీఆర్సీ అమలు..!!

Good News

 జల మండలి ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ శుభ వార్త చెప్పింది. జల మండలి బోర్డు లో పని చేస్తున్న ఉద్యోగులు అందరికీ పీఆర్సీ అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.



మేరకు కేసీఆర్‌ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. ఈ నెల నుంచే జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు కానుందని అధికారికంగా ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.


KCR-TRS

నవంబరు మాసం నుంచే పెంచిన వేతనాలను చెల్లించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది సర్కార్‌. గత కొన్ని నెలలు గా జల మండలి ఉద్యోగులు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా జల మండలి ఉద్యోగుల డిమాండ్ల ను పరిగణంలోకి తీసుకున్న కేసీఆర్‌ సర్కార్‌… ఇవాళ పీఆర్సీ అమలు చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై జల మండలి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు


No comments

Powered by Blogger.