Latest

Loading...

Green Tea : క్యాన్సర్స్ కణాలను నివారించే గ్రీన్ టీ...!!

Green Tea

 Green Tea : గ్రీన్ టీ రోజూ సేవిస్తే..గుండె పదికాలాలపాటు పదిలంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.


యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఈ టీని టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు తప్పకుండా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ పెరుగుదలను నిరోధిస్తుంది. గుండె సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. గ్రీన్‌టీలో తక్కువ కెలోరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ టీని తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీనిని తీసుకోవటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిపెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు క్రమం తప్పకుండా తీసుకుంటే, రక్తపోటు అదుపులో ఉంటుంది. గ్రీన్ టీ రక్త కణాలకు ఇబ్బంది కలగకుండా క్యాన్సర్ కణాలను తొలగిస్తూ, పెద్దప్రేగు ,కడుపు భాగం, క్లోమము మరియు పిత్తాశయమును క్యాన్సర్ ప్రమాదము నుండి కాపాడుతుంది.క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా గ్రీన్ టీ ఉపయోగపడుతుంది.


గ్రీన్ టీ తాగటం వల్ల మెదడుకి చాలా మంచిది, ఇది ప్లేక్స్ ఏర్పడటాన్ని నివారించి, మతిమరపు రాకుండా చేస్తుంది. కీళ్ళ నొప్పి,కీళ్ళవాతం ఇలాంటి ఇబ్బందులనుండి కాపాడుతుంది. గ్రీన్ టీ శరీరాన్ని సన్నగా మరియు ఫిట్ గా ఉంచుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ గ్రీన్ టీని సేవిస్తే శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. గ్రీన్ టీలో కొటేకిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. మనిషి శరీరం..కార్బొహైడ్రేట్లను త్వరగా జీర్ణం చేయకుండా నియంత్రిస్తాయి. ఫలితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. బరువు ఎప్పుడైతే తగ్గుతుందో..ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. శరీరంలో ఉన్న ఇన్సులిన్ సరిగ్గా వినియోగం అవుతుంది. దీంతో రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఈ విధంగా టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.


టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు రోజూ 2-3 కప్పుల గ్రీన్ తాగితే మంచిది. వైద్యుల సూచన మేరకే గ్రీన్ టీ తీసుకోవాలి. ఇదిలా వుంటే రోజుకు రెండు కప్పులకు మించి గ్రీన్ టీ తాగరాదు. మోతాదుకు మించితే మాత్రం ఇబ్బందులు కొన్ని తెచ్చుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ టీలోనూ కొద్దిగా కెఫీన్ ఉంటుంది. ఉండదనుకుని రోజుకు నాలుగైదు కప్పులు లాగిస్తే, శరీరంలోకి కెఫీన్ ఎక్కువగానే చేరిపోతుంది గర్భవతులు రెండు కప్పుల కంటే ఎక్కువ గ్రీన్ టీ తాగితే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ ఎక్కువ తాగితే గ్యాస్ట్రిక్, లివర్‌కి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి


No comments

Powered by Blogger.