Health Tips వారానికోసారి `కంద` తింటే ఆ సమస్యలన్నీ పరార్...!!
దుంప జాతికి చెందిన కంద గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కంద దుంపతో ఎన్నో రకరకాల వంటలు చేస్తుంటారు. ఎలా చేసినా.. కంద రుచి అద్భుతంగా ఉంటుందని చెప్పాలి.
చూపుకు అందహీనంగా ఉన్నా.. దుంప కూరల్లో కంద గడ్డ రుచికి సాటి మరొకటి లేదనే చెప్పాలి. అయితే కేవలం రుచిలోనే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలోనూ కంద దుంప ముందుంటుంది. అవును, వారానికోసారి కంద తీసుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
కంద దుంపలో విటమిన్ ఎ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, కంద దుంపును వారానికి ఒక సారి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి సమస్యలను దూరం చేస్తుంది. విటమిన్ సి శరీర రోగ నిరోధక శక్తి బలపడేలా చేస్తుంది. ఈ కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అలాగే బరువు తగ్గాలనుకునే వారు ఖచ్చితంగా కంద దుంపను డైట్‌లో చేర్చుకోవాలి. ఎందుకంటే.. ఫైబర్ పుష్కలంగా ఉండే కందను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయి ఉన్న అదనపు కొవ్వును కరిగించి.. బరువు తగ్గేలా చేస్తుంది. అధిక రక్తపోటు ఉన్న వారికి కంద దుంప బెస్ట్ అప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే, కంద తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ అయ్యి.. అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.
అదేవిధంగా.. క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మినిరల్స్ లభ్యమయ్యే కంద దుంపను వారానికి ఒక సారి తీసుకోవడం వల్ల గుండె పోటు, ఇతర గుండె జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే కందను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. కాబట్టి, డయాబెటిస్ ఉన్న వారు కందను డైట్‌లో చేర్చుకోవడం మంచిదంటున్నారు.
No comments