Latest

Loading...

Health Tips బీపీ మొదలు యూరిన్ ఇన్ఫెక్షన్స్ వరకు భృంగరాజ్ తో మటు మాయం....!

Health Tips

 

గుంటకలగర ఒక రకమైన ఆయుర్వేద మూలిక. ముఖ్యంగా ఆయుర్వేద మందులను తయారు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. సహజంగా భృంగరాజ్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాసరే హెయిర్ ప్రొడక్ట్స్ ను తయారు చేయడానికి ఎక్కువగా దీనిని ఉపయోగించడం జరుగుతుంది.



గుంటకలగర ఆకులను ఉపయోగించి ఎటువంటి సమస్యలకు చెక్ పెట్టచ్చు.


విరోచనాలు సమస్య ఉండదు:


గుంటకలగర ద్వారా విరోచనాలు నుండి విముక్తి పొందవచ్చు, ఇది ఒక వంటింటి చిట్కా లాంటిదే. శరీరంలో కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల విరోచనాలు కలుగుతాయి. దాంతో కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది. గుంటకలగరలో ఉండే కెమికల్ కాంపోజిషన్ వల్ల అటువంటి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పనిచేసి విరోచనాలు సమస్యను దూరం చేస్తుంది.


కురులని అందంగా మారుస్తుంది:


జుట్టు ఊడిపోవడం అనేది సాధారణమైన సమస్యగా మారింది. జుట్టు తెల్లబడడం, ఊడిపోవడం, బట్టతల ఇలా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. గుంటకలగర జుట్టుకి ఉపయోగించడం వల్ల ఎంతో త్వరగా జుట్టుని పెంచుకోవచ్చు అని ఒక పరిశోధనలో తేలింది.


జ్వరం, ఇంఫ్లమేషన్ తగ్గుతుంది:


గుంటకలగరలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వాటి వల్ల చర్మం పై వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. దాంతో పాటుగా మైగ్రేన్ మరియు తలనొప్పి వంటివి కూడా నయం అవుతాయి.

కాబట్టి ఇటువంటి సమస్యలను ఎదుర్కొనేవారు గుంటకలగరను కచ్చితంగా ఉపయోగించండి.


యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండదు:


గుంటకలగరలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వల్ల హానికరమైన బ్యాక్టీరియా శరీరంలో నుండి తొలగిపోతుంది. ఇలా జరగకపోతే యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి. గుంటకలగరను తీసుకోవడం వల్ల యూరినరీ బ్లాడర్ ఆరోగ్యంగా ఉంటుంది మరియు దాని ప్రక్రియను సక్రమంగా చేయడానికి ఉపయోగపడుతుంది.


బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది:


గుంటకలగరను తీసుకోవడం వల్ల శరీరంలో లిపిడ్ లెవెల్స్ ను పెరగడానికి ఉపయోగపడుతుంది. దాని వల్ల బిపి కంట్రోల్ లో ఉంటుంది. ఈ విధంగా గుండెజబ్బులు కూడా దరిచేరకుండా ఉంటాయి.

No comments

Powered by Blogger.