Latest

Loading...

Health Tips చలికాలంలో జలుబు, దగ్గు రాకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

Health Tips

 చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల నుండి బయట పడటం కొంచెం కష్టమే. అలాంటప్పుడు ఈ ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి.


చలికాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి బయట పడాలంటే బెల్లం మరియు మిరియాలు బాగా ఉపయోగపడతాయి.


జలుబు మొదలైన సమస్యలు తొలగించడానికి ఇవి ఎంతగానో సహాయం చేస్తాయి. బెల్లం మరియు మిరియాలలో ఒంటిని వేడి చేయించే లక్షణాలు ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే ఒళ్ళు వేడిగా ఉంటుంది. దీనితో జలుబు దగ్గు ఇన్ఫెక్షన్స్ వంటి వాటి నుండి కూడా దూరం అవ్వచ్చు.


అదే విధంగా మిరియాలు మరియు బెల్లం కలిపి తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతుంది. జలుబుతో బాధపడేవారు రోజూ తీసుకున్నా పర్వాలేదు. అయితే బెల్లం మరియు మిరియాలను కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. మరి ఇక ఆలస్యమెందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చేయండి.


దగ్గు బాధ ఉండదు:


నల్ల మిరియాల తో పాటు బెల్లం కలిపి తీసుకోవడం వల్ల సమస్య తొలగిపోతుంది. అయితే మీరు దీనితో పాటు ఒక కప్పు పెరుగును కూడా తీసుకోండి. ఒక కప్పు పెరుగులో బెల్లం మరియు మిరియాల పొడిని వేసి రోజుకు రెండు సార్లు తీసుకోండి. దీనితో దగ్గు సమస్య నుండి బయట పడవచ్చు.


గొంతు రిలీఫ్ గా ఉంటుంది:


మీరు బెల్లం మరియు నల్ల మిరియాలను తీసుకోవడం వల్ల గొంతు సమస్యల నుండి కూడా బయట పడొచ్చు. 80 గ్రాముల బెల్లం పొడిలో 20 గ్రాములు మిరియాలపొడి వేసి 10 గ్రాముల బార్లీ పొడి 25 గ్రాములు దానిమ్మ తొక్క పొడి వేసే ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని గోరువెచ్చని నీటితో తీసుకుంటే గొంతు సమస్యల నుండి బయట పడవచ్చు. దీంతో మీకు తక్షణ రిలీఫ్ వస్తుంది. అలానే ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు.

No comments

Powered by Blogger.