Health Tips లివర్ కేన్సర్‌కు మందుగా 'మనతక్కాలి'....కేరళ ఔషద మొక్కకు ఎఫ్‌డిఎ గుర్తింపు....!!
నల్లని రంగులో నిగనిగలాడుతూ గుత్తులుగుత్తులుగా విరగగాసే కేరళలోని ఒక ఔషద మొక్కకు అరుదైన గుర్తింపు లభించింది
స్థానికంగా 'మనతక్కాలి (నల్లకాశి - బ్లాక్ నైట్‌షేడ్ లేదా సోలానమ్ నిగ్రుమ్)గా పిలుచుకునే ఈ మొక్కకు మంచి ఔషద గుణాలున్న మొక్కగా సాంప్రదాయ వైద్యంలో విశేష గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని ఇప్పుడు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డిఎ) సైతం నిర్ధారించింది. రాజీవ్ గాంధీ జీవ సాంకేతిక కేంద్రం (ఆర్‌జిసిబి) శాస్త్రవేత్తల పరిశోధనా పత్రాలను విశ్లేషించిన అనంతరం మనతక్కాలికి కాలేయ కేన్సర్‌ను నయం చేసే గుణాలున్నాయని ఎఫ్‌డిఎ తెలిపింది. అరుదైన జబ్బులకు నూతన చికిత్సా విధానాలను ఆవిష్కరించేందుకు, అభివృద్ధి చేసేందుకు 'ఆర్పాన్ డ్రగ్' పేరుతో ఎఫ్‌డిఎ గుర్తింపునిస్తుందని, ఈ గుర్తింపుతో తమ పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇది దోహదపడుతుందని ఆర్‌జిసిబి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రూబీ జాన్ ఆంటో తెలిపారు.
No comments