Latest

Loading...

HealthTips ఈ నాలుగు గింజలు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటే....? అద్భుత ఫలితాలు...!!

HealthTips

 Fenugreek, Raisins, Almonds & Flax Seeds Benefits:

 కరోనా దెబ్బకి అందరు ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు.


ఫిట్‌గా ఉండటానికి గంటల తరబడి జిమ్‌లో వర్కవుట్ చేయడం, ఎక్సర్‌ సైజ్‌ చేయడం, యోగా, మెడిటేషన్‌ మొదలుగునివి చేస్తున్నారు. వృద్దులు మైదానాలలో ఎక్కువ సేపు నడక కొనసాగిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ వర్కవుట్స్‌ ఒక్కటే సరిపోదు దీంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా తినాలి. ఇందుకోసం ఈ వేర్వేరు గింజలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తింటే అద్భుత ఆరోగ్య ఫలితాలు ఉంటాయి. ఒక్కసారి అవేంటో తెలుసుకుందాం.


1. మెంతులు


మెంతులు రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల మహిళల్లో సాధారణ సమస్య అయిన కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. మెంతి గింజలు కడుపుకు మేలు చేస్తాయి. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఇది పేగులను శుభ్రపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతులు చాలా మేలు చేస్తాయి. ఇది ఋతు నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.


2. ఎండుద్రాక్ష


ఎండుద్రాక్షలో ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎండుద్రాక్షను రాత్రిపూట నానబెట్టి, ఉదయం తింటే మీ చర్మం ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటుంది. చాలా మంది మహిళలు ఐరన్‌ లోపాన్ని ఎదుర్కొంటారు ఎండుద్రాక్ష తినడం వల్ల మీరు దీనిని భర్తీ చేయవచ్చు.


3. అవిసె గింజలు


1 టీస్పూన్ ఫ్లాక్స్ సీడ్ మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినండి. ఈ గింజల్లో ఫైబర్, ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది


. ఈ విత్తనాలు క్యాన్సర్, మధుమేహం నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.


4. బాదం


ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన బాదంపప్పును తినడం వల్ల మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. బాదంలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారికి చక్కగా పనిచేస్తుంది. నానబెట్టిన బాదం బరువు తగ్గడానికి కూడా చాలా మంచిది.


No comments

Powered by Blogger.