Healthy drink: ఈ సీజన్‌లో ఇమ్యూనిటీని పెంచే హెల్త్ డ్రింక్స్ ఇవే.....!!
శీతాకాలం (winter) అందరికీ ఇష్టమైన సీజన్ అయినప్పటికీ ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్‌లో వచ్చే తీవ్రమైన గాలి, చల్లని వాతావరణం ఆరోగ్యంపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి.
అందువల్ల సీజన్ మారుతున్న సమయంలో ఇమ్యూనిటీ (immunity power) పెంచడంపై దృష్టి పెట్టడం ముఖ్యం. మారుతున్న రుతువుల నేపథ్యంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వివిధ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాబట్టి ఈ చలికాలంలో మీ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కొన్ని రుచికరమైన డ్రింక్స్‌ను ఇంట్లోనే తయారు చేసుకోండి. ఆ వివరాలు తెలుసుకుందాం.
పసుపులో (turmeric) ని కర్కుమిన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ పదార్థాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో పాలలో చిటికెడు పసుపు కలపడం లేదా సాధరణ టీ తయారు చేసుకోవాలి. ఇది కండరాల, కీళ్ల నొప్పులు మొదలైన వాటì కి ప్రభావవంతంగా చికిత్స చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కణాలను దెబ్బతినకుండా కాపాడడం ద్వారా ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో కూడా సహాయపడుత
పసుపు టీని సులభంగా తయారు చేయడానికి చిటికెడు పసుపు, అల్లం వేసి నీటిని మరిగించాలి. కావాలనుకుంటే ఈ టీలో తేనె కూడా కలుపుకోవచ్చు. పసుపు పాలు తయారు చేయడానికి 1/2 కప్పు నీరు 1 కప్పు పాలు మరిగించాలి. ఇప్పడు కావాలంటే చిటికెడు పసుపు, చిటికెడు ఎండుమిర్చి, కొద్దిగా పంచదార వేయాలి. అయితే రోగనిరోధక శక్తి, జీవక్రియలను పెంచడంతోపాటు బరువు తగ్గాలంటే మాత్రం షుగర్ వేయకూడదు.
యాపిల్ స్మూథీ..
ఈ యాపిల్ స్మూథీ రోగనిరోధక శక్తితో సహా మొత్తం శరీరం జీవక్రియను పెంచడానికి సరైన పానీయం. దీని కోసం ఒక యాపిల్‌ను చిన్న ముక్కలుగా కట్ చేసి, పాలలో నానబెట్టిన 3 ఖర్జూరాలు, 3 బాదం పప్పులను కలపాలి. తర్వాత నానబెట్టిన చీయా సీడ్స్‌ను కలపాలి. ఇప్పుడు ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఈ పానీయం మన పేగులకు, జీవక్రియను పెంచడానికి చాలా ఆరోగ్యకరమైంది.
ఇది కూడా చదవండి: జాగ్రత్త..ఈ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?
అవకాడో స్మూథీ..
బ్లెండర్‌లో 1 కప్పు కడిగిన స్పీనచ్, సగం అవకాడోను బాగా బ్లెండ్ చేసుకోవాలి. చిటికెడు ఉప్పు, నల్ల మిరియాలు, 1/2 చెక్క నిమ్మరసం జోడించాలి. ఈ ఆరోగ్యకరమైన డ్రింక్ పోషకమైందే కాదు ఐరన్, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో కణాలను పునరుత్పత్తి చేయడంలో.. రక్త ప్రసరణను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఆమ్లా డ్రింక్...
4-5 ఆమ్లాల గింజలు తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసి 1 కప్పు నీరు, 1 చిటికెడు ఎండుమిర్చి, చిటికెడు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. కావాలంటే తేనెను వేసుకుని ఉదయానే తాగాలి.
No comments