Latest

Loading...

Jaggery Milk Benefits : పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే ఈ సమస్యలు ఖతం....ప్రయోజనాలను తెలుసుకోండి...!!

Jaggery Milk Benefits

సాధారణంగా పాలల్లో పసుపు కలిపి తీసుకుంటే జలుబు.. గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే పసుపు పాలు రాత్రి సమయంలో తీసుకుంటే నిద్రలేమి సమస్య నుంచి సులభంగా బయటపడతాం అంటారు.


కానీ పాలల్లో బెల్లం కలిపి తీసుకున్నా ఎన్నో ప్రయోజనాలున్నాయి తెలుసా. ఉదయాన్నే బెల్లం కలిపిన పాలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలల్లో విటమిన్ ఎ, బి, డితోపాటు కాల్షియం, ప్రోటీన్, లాక్టిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉండడం.. సుక్రోజ్, గ్లూకోజ్, ఐరన్ వంటి అనేక ఖనిజాలున్నాయి. అందుకే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.


పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. రక్తాన్ని డీటాక్స్ చేసేలా పనిచేస్తుంది. అయితే పాలల్లో చెక్కర కలిపి తీసుకుంటే ఊబకాయం పెరుగుతుంది. అదే బెల్లం కలిపి తీసుకుంటే ఉబకాయం సమస్య తగ్గుతుంది. వేడి వేడి పాలు బెల్లం కలిపి తీసకుంటే కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ బెల్లం పాలు పనిచేస్తాయి. బెల్లం వేరుగా తీసుకున్న కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడిపాలు.. బెల్లం తీసుకోవడం వలన చర్మ సమస్యలు తగ్గుతాయి. అలాగే చర్మం మృదువుగా ఉంటుంది. గోరువెచ్చని పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే స్త్రీలకు పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. బెల్లం పాలు కలిపి తీసుకోవడం వలన నిద్రలేమి సమస్య తగ్గుతుంది. చలికాలంలో బెల్లం కలిపిన పాలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే అజీర్ణం సమస్య తగ్గుతుంది. బరువు తగ్గిస్తుంది. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

No comments

Powered by Blogger.