Latest

Loading...

Joint Pain Home Remedies 7 రోజులు-కీళ్ల నొప్పులు,శారీరక బలహీనత,రక్తహీనత లేకుండా 65 ఏళ్ల వయస్సులో కూడా 25 ఏళ్ల చురుకుదనం....!!!


 Joint Pain Home Remedies : ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా calcium లోపంతో బాధ పడుతున్నారు.

calcium లోపం ఉన్నప్పుడు శారీరక బలహీనత, అలసట, కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి వస్తూ ఉంటాయి.


ఒకప్పుడు 50 నుంచి 60 సంవత్సరాలు వచ్చాక ఇటువంటి సమస్యలు వచ్చేవి. కానీ ఇప్పుడు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. calcium లోపాన్ని అసలు అశ్రద్ధ చేయకూడదు. ఈరోజు ఈ లోపాన్ని సరి చేసుకోవడానికి ఒక మంచి ఇంటి చిట్కా తెలుసుకొందాం. చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.


ఈ చిట్కా కోసం కేవలం 2 ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఒక బౌల్ లో ఒక అంజీర్, 8 నుంచి 10 కిస్ మిస్ లను వేసి నీటిని పోసి 5 గంటల పాటు నానబెట్టాలి. నానిన అంజీర్, కిస్ మిస్ లను తింటూ ఆ నీటిని తాగాలి.


ఈ విధంగా 10 రోజుల పాటు చేస్తే calcium లోపం తగ్గుతుంది. అలాగే రక్తహీనత, అలసట, నీరసం, కీళ్ల నొప్పులు అన్నింటి నుండి ఉపశమనం కలుగుతుంది. అంజీర్ కాస్త ధర ఎక్కువైన దానికి తగ్గట్టుగా ప్రయోజనాలను అందిస్తుంది.


అంజీర్ లో విటమిన్-ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియంతో పాటు క్లోరిన్ లభిస్తాయి. ఇంకా ఫ్లవనోయిడ్స్‌, పాలిఫినోల్స్‌ను సమృద్ధిగా ఉంటాయి.


ఇందులోని ట్రిప్టోఫాన్ హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. అందుకే నిద్రలేమితో బాధపడే వారికి మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. శారీరక బలహీనత ను తొలగిస్తుంది.


అంజర్ లో ఇరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి మంచి ప్రయోజనకరి అని చెప్పవచ్చు.


కిస్ మిస్ చూడ్డానికి సన్నగా ఉన్నా.. అందులోని పోషకాలు అమోఘం. కిస్ మిస్ లో విటమిన్ బి, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ కిస్ మిస్ టేస్టీగానే కాదు, తేలికగా తినవచ్చు. అలాగే కార్బోహైడ్రేట్స్ కావాల్సిన మోతాదులో పొందవచ్చు.


దీనిలో కాల్షియం పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. పొట్ట కు సంబంధించిన సమస్యలను తొలగిస్తుంది. ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల నొప్పులు, కీళ్ల నొప్పులు, రక్తహీనత, అలసట వంటి వాటి నుండి ఉపశమనం కలిగిస్తుంది.


శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అధిక బరువు సమస్య నుంచి బయటపడేస్తుంది. శరీరాన్ని బలంగా ఉంచుతుంది. వీటిని తీసుకోవడం వలన శరీరంలో బలహీనత తగ్గుతుంది. కాబట్టి నానబెట్టిన అంజీర్, కిస్ మిస్ తీసుకొని ఈ ప్రయోజనాలను పొందండి.


No comments

Powered by Blogger.