Joint Pains Home Remedies 3 రోజులు తాగితే..90 ఏళ్ళు వచ్చిన ఎముకల బలహీనత,కీళ్లనొప్పులు,నిద్రలేమి జీవితంలో ఉండవు
Joint Pains Home Remedies : ఒకప్పుడు కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు అనేవి 50 నుంచి 60 ఏళ్ళు వచ్చేసరికి వచ్చేవి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో 30 సంవత్సరాలు వచ్చేసరికి అన్నీ రకాల నొప్పులు వచ్చేస్తున్నాయి.
సమస్య చిన్నగా ఉంటే ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.
ఈ రోజు ఈ రెమెడీ కోసం సొంపు, అల్లం ఉపయోగిస్తున్నాం. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి దానిలో అరస్పూన్ సొంపు, చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. మరిగిన పాలను వడకట్టి ఉదయం సమయంలో తాగాలి. బ్రేక్ ఫాస్ట్ చేయటానికి అరగంట ముందు తాగాలి.
ఉదయం తాగటం కుదరని వారు సాయంత్రం తాగవచ్చు. అయితే ఈ పాలను తాగటానికి ముందు అరగంట కడుపు ఖాళీగా ఉంటే మంచిది. ఈ పాలను తీసుకోవటం వలన క్యాల్షియం లోపం తగ్గుతుంది. క్యాల్షియం లోపం కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు రావటమే కాకుండా నీరసం, అలసట, నిద్రలేమి వంటివి కూడా వస్తాయి.
క్యాల్షియం లోపం లేకుండా చూసుకోవాలి. పాలల్లో కూడా క్యాల్షియం సమృద్దిగా ఉంటుంది. అన్నీ వయస్సుల వారు ప్రతి రోజు తప్పనిసరిగా పాలను తాగాలి. ఇప్పుడు తయారుచేసుకున్న పాలను తాగితే క్యాల్షియం లోపం లేకుండా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ క్యాల్షియం లోపం ఉంటే మాత్రం డాక్టర్ సూచించిన మందులను వాడుతూ ఈ పాలను తాగితే తొందరగా మంచి ఫలితం వస్తుంది.
No comments