Latest

Loading...

Joint Pains Oil కండరాల నొప్పులు,కీళ్ల నొప్పులు,నడుము నొప్పి ఎలాంటి నొప్పి అయినా నిమిషంలో మాయం...!!!

Joint Pains Oil

 Joint Pains Oil In Telugu :మనలో చాలా మంది ఎన్నో రకాల నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. నొప్పి రాగానే మంలో చాలా మంది painKiller టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు.


ఇలా painKiller టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవటం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్యలు ఏమి లేకుండా నొప్పులను తగ్గించటానికి ఒక నూనె తయారి గురించి తెలుసుకుందాం.


50 ఎంఎల్ ఆవనూనె లో ఒక స్పూన్ మిరియాలను దంచి వేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి పొయ్యి మీద పెట్టి 6 నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించటం వలన మిరియాలలో ఉండే లక్షణాలు ఆవనూనెలోకి చేరతాయి. ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి.


నొప్పులు ఉన్న ప్రదేశంలో ఈ నూనెను రాశి సున్నితంగా మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. నొప్పులు ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరకు వెళ్ళి డాక్టర్ సూచనలను పాటిస్తూ ఈ నూనెను వాడితే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఆవనూనె చర్మం లోపలకు చొచ్చుకొని పోయి నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది.


అలాగే మిరియాలలో ఉన్న లక్షణాలు కూడా నొప్పులు తగ్గటానికి సహాయపడుతుంది. ఈ నూనెను తయారుచేసుకోవటం చాలా సులభం. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి.


No comments

Powered by Blogger.