Latest

Loading...

Leftover Food: రాత్రి మిగిలిన ఆహారాన్ని తింటున్నారా..! దుష్ప్రభావాలు ఉంటాయి...!!

Side Effects of Eating Leftover Food

 Side Effects of Eating Leftover Food: చాలామంది వ్యక్తులు రాత్రిపూట మిగిలిన ఆహార పదార్థాలను ఉదయం తింటారు. వాటిని పారేయడానికి ఇష్టపడరు ఎందుకంటే అలా చేస్తే ఆహారాన్ని అవమానించినట్లవుతుందని చెబుతారు.


నిజమే కావొచ్చు. కానీ దానివల్ల అనారోగ్యానికి గురై ఆస్పత్రుల చుట్టు తిరగాల్సి ఉంటుంది. రాత్రి భోజనంలో ఏదో ఒకటి మిగిలి ఉండడం దానిని ఫ్రిజ్‌లో పెట్టి ఉదయం వేడి చేసి తినడం సాధారణం అయిపోయింది. దాదాపు ప్రతి ఇంట్లో ఇదే తంతు జరుగుతుంది.


మిగిలిపోయిన ఆహారం ఎక్కువ సమయం ఉంటే అది పాడవుతుంది. అయితే రాత్రి మిగిలిన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదం ప్రకారం 24 గంటలకు మించి ఉంచిన ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. అంతే కాదు ఆహారం ఫ్రిజ్‌లో ఉంచితే బ్యాక్టీరియా, ఇతర రోగకారక క్రిములు పెరుగుతాయి.


దీనిని తినడం వల్ల అనేక వ్యాధులు సంభవిస్తాయి. ఎప్పుడైనా కానీ రాత్రి ఆహారం మీ శరీరానికి హానికరం. అదే సమయంలో మైక్రోవేవ్‌లో వేడి చేసిన ఆహారాన్ని తింటే అస్సలు మంచిది కాదు. మైక్రోవేవ్‌లో ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం ద్వారా విటమిన్లు , ముఖ్యమైన పోషకాలు నాశనం అవుతాయి. ఇలా చాలా సార్లు వేడి చేయడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఆహారాన్ని ఉడికించిన తర్వాత 90 నిమిషాలలోపు తినాలి.


ఆహారాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వేడి చేయకూడదు గుర్తుంచుకోండి. బియ్యం ఉడికిన తరువాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచినప్పుడు బ్యాక్టీరియాగా మారుతుంది. దీని తరువాత ఈ బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మీకు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది. అందువల్ల అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకూడదు. అలాగే అన్నం కొన్ని గంటలు మాత్రమే ఫ్రిజ్‌లో తాజాగా ఉంటుంది. అలాగే అన్నం వేడి చేసిన తర్వాత తినాలనుకుంటే ఒక్కసారి మాత్రమే వేడి చేయండి.

No comments

Powered by Blogger.