Latest

Loading...

Lemon Juice పరగడుపున నిమ్మకాయ రసం తాగితే నిజంగానే బరువు తగ్గుతారా..? వాస్తవాలు ఏంటో తెలుసుకోండి......!!

Lemon Juice

 Lemon Juice: పరగడుపున నిమ్మకాయ రసం తాగితే బరువు తగ్గుతారని యూట్యూబ్‌లో కనీసం150 వీడియోలు ఉండవచ్చు. ఇంటర్నెట్‌లో వెతికినా మీకు ఇలాంటి వందల కొద్దీ స్టోరీలు కనిపిస్తాయి.


అయితే ఇది నిజమేనా.. శాస్త్రీయంగా నిరూపణ అయిందా.. కానీ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన వందలాది పరిశోధనలలో లెమన్ వాటర్ బరువు తగ్గిస్తుందని ఎక్కడా నిరూపణ కాలేదు. స్పెయిన్ బార్సిలోనా విశ్వవిద్యాలయం పరిశోధకులు బరువు తగ్గడానికి, లెమన్‌ జ్యూస్‌కి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. ఈ అధ్యయనం ప్రకారం నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కాలేయ సమస్యలను నయం చేస్తుందని తేలింది.


నిమ్మకాయ మన రక్తంలో చక్కెర స్థాయిని ఆశ్చర్యకరంగా తగ్గిస్తుందని ఈ అధ్యయనంలో కనుగొన్నారు. సిట్రిక్ యాసిడ్ కాలేయం చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడంలో, పిత్తాశయం సాఫీగా పనిచేయడంలో సహాయపడుతుందని తెలుసుకున్నారు. మూడు నెలల పాటు రోజూ నాలుగు పెద్ద నిమ్మకాయల రసాన్ని సేవించే వ్యక్తుల కాలేయంలో గుణాత్మక మార్పులను గమనించారు. దీంతో పాటు జీర్ణవ్యవస్థ పనితీరులో కూడా మార్పులు గమనించారు.కొవ్వును కాల్చే హార్మోన్ను సక్రియం చేయడంలో సిట్రిక్ యాసిడ్ పాత్ర ఉంది. నిమ్మకాయలో ఉండే సిట్రిక్‌ యాసిడ్ కొవ్వును కరిగించడంలో సహాయపడతాయని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు.


శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఔషధ గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. దీంతో అధిక బరువు ఉన్నవారు నిమ్మరసం తాగితే ఫలితం ఉంటుంది. అంతేకాదు ఇలా తాగడం వల్ల రక్త సరఫరా మెరుగవుతుంది. గుండె సంబంధ సమస్యలు కూడా దాదాపు రావు. డయాబెటిస్ ఉన్నవాళ్లు నిమ్మరసం తాగితే, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది. నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

No comments

Powered by Blogger.