Night Curfew : పెరుగుతున్న కోవిడ్ కేసులు...అక్కడ మళ్లీ నైట్ కర్ఫ్యూ...!!
Night Curfew In Jammu : దేశంలో మళ్లీ కోవిడ్ కర్ఫ్యూలు మొదలయ్యాయి.
కోవిడ్ ఆంక్షలన్నీ ఒక్కొక్కటిగా తొలిగిపోతూ వస్తున్న సమయంలో..మళ్లీ కరోనా కేసుల విజృంభణతో మళ్లీ కర్ఫ్యూ కాలం మొదలయ్యింది. జమ్మూలో కోవిడ్ పాజిటివిటీ రేటు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుండి రాత్రి కర్ఫ్యూ(నైట్ కర్ఫ్యూ) విధించబడుతుందని స్థానిక అధికారులు తెలిపారు.
జమ్మూలో పెరుగుతున్న కోవిడ్ పాజిటివిటీ రేటును దృష్టిలో ఉంచుకుని, నవంబర్ 17 (బుధవారం) నుండి రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ(DDMA) రాత్రి కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది అని డిస్ట్రిక్ మెజిస్ట్రేట్ అన్షుల్ గార్గ్ మంగళవారం ఓ ట్వీట్లో తెలిపారు. ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జమ్మూ నగరంలో నివసించే ప్రజలు కోవిడ్-19 గైడ్ లైన్స్ ను పాటించాలని,అర్హులైన ప్రతి ఒక్కరూ రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన సూచించారు.
అన్ని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, తహసీల్దార్లు కొత్త డెవలప్ మెంట్(కోవిడ్ కేసుల పెరుగుదల) గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లపై ప్రకటనలు చేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ (DDMA)జమ్మూ నగరంలో కోవిడ్ పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించి, ఇటీవల పాజిటివిటీ రేటు 0.2 శాతం పెరిగినందున తక్షణ చర్యలు అవసరమని నిర్ణయించినట్లు గార్గ్ తెలిపారు.
No comments