Latest

Loading...

Omicron variant ఓమిక్రాన్ వేరియంట్ ప్రాణాంతకం కాదు - రష్యా శాస్త్రవేత్తలు

Omicron variant

 ఓమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరమని.. దీని వల్ల గతంలో ఎన్నడూ లేనన్ని మరణాలు సంభవిస్తాయని ప్రపంచ ఆరోగ్య చెబుతుంది. కానీ రష్యా శాస్త్రవేత్తలు మాత్రం ఓమిక్రాన్ వేరియంట్ భయపడేంత ప్రాణాంతకం కాదని అంటున్నారు.



దీని పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. అయితే రష్యా కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త అలెక్సీ అగ్రనోవస్కీ ఓమిక్రాన్ గురించి ప్రపంచ మీడియా కు తెలిపాడు.


ఓమిక్రాన్ ఒక అంటువ్యాధి లా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఓమిక్రాన్ కేసు లలో ఇది ప్రమాదరమైనది అని గానీ ప్రాణాంతకం అని ఎక్కుడా కూడా రుజువు కాలేదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తం గా వచ్చిన ఓమిక్రాన్ వేరియంట్ తో ఒక్కరు కూడా మరణించ లేదని ఆయన అన్నారు. కాగ ఓమిక్రాన్ వేరియంట్ ఇప్పటి వరకు 14 దేశాలకు పాకింది. అలాగే ప్రపంచ దేశాలను గడ గడ లాడిస్తుంది. ఓమిక్రాన్ భయం తో ఇప్పటికే చాలా దేశాలు ఆంక్షలు విధిస్తున్నారు.

No comments

Powered by Blogger.