PAN Card: పాన్ కార్డ్ పోయిందా...? సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయండి ఇలా....!!
పాన్ కార్డ్... బ్యాంక్ అకౌంట్ దగ్గర్నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల వరకు ప్రతీ చోటా అవసరం అయ్యే డాక్యుమెంట్. భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరపాలంటే పాన్ కార్డ్ (PAN Card) తప్పనిసరి.
ఏఏ లావాదేవీలకు పాన్ కార్డ్ కావాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. అందుకే పాన్ కార్డును ఎప్పుడూ జేబులో పెట్టుకోవడం చాలామందికి అలవాటు. అయితే పాన్ కార్డ్ పోయినప్పుడు డూప్లికేట్ కార్డు ఎలా తీసుకోవాలో, అప్లై చేస్తే కార్డు ఎన్ని రోజులకు వస్తుందో అన్న ఆందోళన కూడా ఉంటుంది. పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్ నుంచి సింపుల్‌గా డౌన్‌లోడ్ (PAN Card Download) చేసుకోవచ్చు. లేదా డిజీలాకర్ (Digilocker) యాప్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు. డౌన్‌లోడ్ చేసిన డాక్యుమెంట్‌ను ప్రూఫ్‌గా చూపించొచ్చు. మరి పాన్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.
ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లో పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా
ఆదాయపు పన్ను శాఖకు చెందిన TIN-NSDL వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Download e-PAN Card ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
మీ పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
నియమనిబంధనల్ని అంగీకరించి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు, ఇమెయిల్ ఐడీకి ఓటీపీ వస్తుంది.
ఓటీపీ ఎంటర్ చేసి Validate పైన క్లిక్ చేయండి.
పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోండి.
కొత్తగా పాన్ కార్డుకు దరఖాస్తు చేసినవాళ్లు కూడా ఇ-పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన 30 రోజుల లోపు కొత్త పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలంటే రూ.8.26 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజులు దాటినవాళ్లు పాన్ కార్డును మళ్లీ పొందాలనుకుంటే కార్డ్ రీప్రింట్ కోసం రూ.50 ఫీజు చెల్లించాలి.
డిజీలాకర్ యాప్‌లో పాన్ కార్డ్ డౌన్‌లోడ్ చేయండి ఇలా
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజీలాకర్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి.
మీ ఆధార్ నెంబర్, ఇతర వివరాలతో లాగిన్ కావాలి.
ఆ తర్వాత issued documents పైన క్లిక్ చేయాలి.
ఆ తర్వాత pull documents పైన క్లిక్ చేయాలి.
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేయాలి.
ఆ తర్వాత PAN Card ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
మీ పేరు, పుట్టిన తేదీ వివరాలన్నీ ఆధార్ నుంచి ఫిల్ అవుతాయి.
మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Get Document పైన క్లిక్ చేయాలి.
మీ పాన్ కార్డ్ డిజీ లాకర్‌లో issued documents సెక్షన్‌లో స్టోర్ అవుతుంది.
No comments