Pan card పాన్ కార్డులో ఫొటో మార్చాలనుకుంటున్నారా....ఇలా చేయండి..!!
పాన్ కార్డు, ఆధార్ కార్డులాంటివి అప్లై చేయాలంటే అప్పటికప్పడు మన దగ్గర ఉన్న ఏదో ఒక ఫొటో ఇచ్చి దరఖాస్తు చేస్తాం. తీరా అవి వచ్చిన తర్వాత వాటి మీద మన ఫొటో చూసి..
అప్పుడే మంచి ఫొటో ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ ఫొటో బాలేదు. ఫొటో మార్చుకునే ఆప్షన్ ఉంటే బాగుండు అనుకుంటాం. అయితే.. ఒకప్పుడు పాన్ కార్డు, ఆధార్ కార్డు మార్చడానికి వీలుండేది కాదు. కానీ.. ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని నచ్చిన ఫొటో మార్చుకోవచ్చు.
పాన్ నెంబర్ అనేది పదంకెల ప్రత్యేక, యూనిక్ ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇది ఒక వ్యక్తి ఆర్థిక చరిత్రను రికార్డు చేస్తుంది. అంతేకాదు.. ఎక్కడికైనా వెళ్తే గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించవచ్చు. మీ ఫొటో, సంతకాన్ని ధృవీకరించడానికి పాన్ కార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి పాన్ కార్డు కోసం ఇచ్చే సమాచారం పక్కాగా ఉండాలి. క్రెడిట్ కార్డ్ లేదా లోన్ తీసుకోవడానికి, పెట్టుబడి పెట్టడానికి పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాల్సిందే. మీ సంతకం, ఫొటో పాన్ కార్డులో ఉన్నట్టుగా లేకపోతే, మార్చుకోవాలని భావిస్తే ఈ ప్రాసెస్ ఫాలో అవండి.
STEP1: పాన్ కార్డు డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి NSDL అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
STEP2: ఆ తర్వాత అప్లికేషన్ టైప్ ఎంపికపై క్లిక్ చేసి పాన్ డేటా ఎడిట్ లేదా ఛేంజెస్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
STEP3: ఇప్పుడు కేటగిరి మెనూలోకి వెళ్లి మీ పర్సనల్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి.
STEP4: ఇప్పుడు మీరు మార్చాలనుకున్న సమాచారాన్ని మార్చండి. వివరాలు పూర్తిగా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి.
STEP5: ఇప్పుడు పాన్ అప్లికేషన్‌కు వెళ్లి KYCని ఎంపిక ఎంచుకోండి. ఆ తర్వాత ఫోటో ఎడిట్, సిగ్నేచర్ ఎడిట్ ఆప్షన్ ని ఎంచుకోవాలి.
STEP6: ఇక్కడ మీ ఫోటో మార్చడానికి ఫోటో ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
STEP7: ఇప్పుడు మీ యొక్క తల్లిదండ్రుల వివరాలను పూరించిన తర్వాత నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేయండి.
STEP8: మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత దరఖాస్తుదారుడి గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ట్యాగ్ చేయాలి.
STEP9: చివరగా డిక్లరేషన్‌ను టిక్ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
STEP10: ఫోటో, సంతకంలో మార్పు కోసం GSTతో కలిపి దరఖాస్తు ఫీజు రూ.101 చెల్లించాలి. విదేశాల్లో చిరునామా ఉంటే.. ఆ చిరునామా మీద కావాలంటే రూ.1011 చెల్లించాలి.
STEP11: ఈ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాత 15-అంకెల రశీదు వస్తుంది.
STEP12: అప్లికేషన్ ప్రింటవుట్‌ను ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్‌కి పంపండి.
మీ పాన్ కార్డు ఫొటో, సంతకం ఎడిటింగ్ అప్లికేషన్ పూర్తయినట్టే. మీ ప్రాసెస్ పూర్తయిందా.. లేదా తెలుసుకోవాలంటే మీకు వచ్చిన రశీదు మీద ఉన్న 15 అంకెల నెంబర్ ను ఎంటర్ చేసి ట్రాక్ చేయాలి.
No comments