Latest

Loading...

Pineapple Health Benefits పైనాపిల్ బెస్ట్ మెడిసిన్...!!

Pineapple Health Benefits


సీజన్​ మారితే జలుబు చేస్తుంటుంది కొందరు పిల్లలకి.


ఆ వెంటనే దగ్గు, గొంతు, తల నొప్పులు వస్తాయి. వీటన్నింటికీ వంటింటి చిట్కాలు చాలానే ఉన్నా.. పైనాపిల్​ జ్యూస్​ కూడా బెస్ట్ మెడిసెన్​ అంటున్నారు న్యూట్రిషనిస్ట్​ ఎక్స్​పర్ట్​ కవిత దేవగన్​. అసలు పైనాపిల్​కి, జలుబుకి లింక్​ ఏంటి? పైనాపిల్​ తినడం వల్ల ఇంకా ఏమేం లాభాలున్నాయో కూడా చెప్పారామె.


జలుబు చేస్తుందేమోనని సీజన్​లో జ్యూస్​లు తాగరు చాలామంది. కానీ జ్యూస్​కి, జలుబుకి సంబంధమే లేదు. నిజానికి కొన్ని ఫ్రూట్​ జ్యూస్​లు జలుబు, దగ్గుల నుంచి రిలీఫ్​ ఇస్తాయి కూడా. ముఖ్యంగా జలుబు చేసినప్పుడు పైనాపిల్​ జ్యూస్​ తాగితే బోలెడు లాభాలున్నాయి.


జలుబు ఎలా తగ్గుతుంది?

పైనాపిల్​లో బ్రోమెలైన్​ అనే ఎంజైమ్​ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో విటమిన్​- సి కూడా పుష్కలం. ఇవి రెండూ కలిసి నాసిల్​ కావిటీలో ఇన్​ఫ్లమేషన్​ని కంట్రోల్​ చేస్తాయి. శ్వాస కోశ సిస్టమ్​లో ఉన్న మ్యూకస్​ని పోగొడతాయి. దాంతో జలుబు, దగ్గు నుంచి త్వరగా రిలీఫ్​ వస్తుంది. పైనాపిల్ జ్యూస్​ తాగితే శ్వాస నాళాల వాపు కూడా తగ్గుతుంది. అలాగే దక్షిణ​ అమెరికా, యూరప్​ దేశాల నుంచి మనదగ్గరికి వచ్చిన ఈ సూపర్​ ఫ్రూట్​లో యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్స్​ కూడా ఎక్కువే.


లాభాలెన్నో..

పైనాపిల్​లోని యాంటీ ఆక్సిడెంట్లు చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. వీటిల్లోని మినరల్స్​, ఎంజైమ్స్ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. బాడీని డిటాక్సిఫై చేస్తాయి. అలాగే పైనాపిల్​లోని విటమిన్​- సి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. కంటి చూపుని కాపాడుతుంది. చర్మాన్ని​ మెరిపిస్తుంది కూడా. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. పైనాపిల్​ గుండె సంబంధిత జబ్బులని దూరంగా ఉంచుతుంది. బాడీ ఫంక్షనింగ్​ సజావుగా అయ్యేలా చూస్తుంది.

ఆక్సిడేటివ్​ స్ట్రెస్​, క్రానిక్​ ఇన్​ఫ్లమేషన్​వల్ల క్యాన్సర్​ బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే పైనాపిల్​ ఆ రెండింటినీ తగ్గించి క్యాన్సర్​ నుంచి కాపాడుతుందని స్టడీలు చెబుతున్నాయి. వైరల్, బ్యాక్టీరియల్​ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా పిల్లలకి ప్రొటెక్షన్​ ఇస్తుంది. సైనస్​ని కంట్రోల్​ చేస్తుంది .

పైనాపిల్ మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. వీటిల్లోని విటమిన్​- బి బ్రెయిన్​ హెల్త్​ని ఇంప్రూవ్​ చేస్తుంది. బ్రెయిన్​ ఫంక్షనింగ్​ సరిగా జరిగేలా చేసి, స్ట్రెస్​ని​ దరిచేరనివ్వదు.

ఈ ఫ్రూట్​లో మాంగనీస్​ ఎక్కువ. ఇది ఎముకల మినరల్​ డెన్సిటినీ పెంచి, బలాన్నిస్తుంది.

ఇదే విషయాన్ని చాలా స్టడీలు కూడా చెప్పాయి. అలాగే ఆడవాళ్లని బోలు ఎముకల డిసీజ్​

( వయసు పైబడ్డాక ఎముకలు మెత్తబడటం) నుంచి బయటపడేస్తాయి. వీటిల్లోని బ్రోమలైన్​ ఎంజైమ్​ గాయాలకి మందులా పనిచేస్తుంది.

దెబ్బ తగిలినప్పుడు వాపు రాకుండా చూస్తుంది. రక్తం గడ్డ కట్టేలా చేసి బ్లడ్​ లాస్​ని కంట్రోల్​ చేస్తుంది. జీర్ణక్రియని కూడా వేగవంతం చేస్తుంది.

No comments

Powered by Blogger.