Latest

Loading...

PM Kisan Samman Nidhi Yojana: వారికి మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ 10వ విడత రూ.2 వేలు....!!

PM Kisan Samman Nidhi Yojana

 ప్రధానమంత్రి నరేంద్ర మోడి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు ఆర్ధిక సహాయం అందించేందుకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని2018 డిసెంబర్ నెలలో ప్రారంభించారు.


ఈ పథకం కింద ప్రతి ఏడాది నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 రైతు ఖాతాలో జమ చేస్తున్న విషయం మనకు తేలిసిందే. ఇప్పటి వరకు 9 సార్లు రూ.2000లను రైతు ఖాతాలలో జమ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 10వ విడత నగదును వచ్చే నెలలో జమ చేసేందుకు సిద్దం అవుతుంది.


అయితే, ఈ పథకానికి సంస్థాగత భూస్వాములు, ఆదాయ పన్నులు చెల్లించే వారు అర్హులు కాదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రయోజనాలను పొందడానికి, రైతులు తమ ప్రధాని కిసాన్ ఖాతాను తమ ఆధార్ కార్డులకు లింక్ చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్ తో లింకు చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ 10వ విడత నగదు జమ చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. ఒకవేళ తప్పుడు ఆధార్ వివరాలు అందించినట్లయితే, ఆ రైతుకు రూ.2000 లభించవు.


మీ ఆధార్ ను ప్రధాని కిసాన్ ఖాతాతో ఎలా లింక్ చేయాలి?


మీ ఆధార్ కార్డుతో పీఎం కిసాన్ ఖాతాను లింక్ చేసిన బ్యాంకు బ్రాంచీకి వెళ్లండి.

బ్యాంకు అధికారి సమక్షంలో ఆధార్ కార్డు జిరాక్స్ కాపీపై మీ సంతకం చేయండి.

మీ ఆధార్ వెరిఫై చేసిన తర్వాత ఆధార్- ప్రధాని కిసాన్ ఖాతాతో లింకు అవుతుంది.

లింకు అయిన అనంతరం, మీకు ఒక ఎస్ఎమ్ఎస్ వస్తుంది

No comments

Powered by Blogger.