Latest

Loading...

Pumpkin : చలికాలంలో గుమ్మడి ప్రయోజనాలు తెలిస్తే అస్సలొదలరు....!!

Pumpkin

 Pumpkin : చలికాలం మొదలవడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ఈ క్రమంలోనే చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో సతమతమవుతుంటారు.


ఈ విధమైన సమస్యలకు చెక్ పెట్టడానికి గుమ్మడి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో గుమ్మడి కాయ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. మరి గుమ్మడికాయ ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా..!


1. గుమ్మడి కాయలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, పీచు పదార్థాలు, కెరోటినాయిడ్స్, విటమిన్ ఇ, జింక్, ఐరన్, కాపర్ వంటి పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి.


2. గుమ్మడికాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే కొద్ది పరిమాణంలో వీటిని తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. కనుక తొందరగా శరీర బరువు తగ్గడానికి గుమ్మడికాయ ఎంతగానో దోహదపడుతుంది.


3. ఇందులో పీచు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల శరీరంలో జీర్ణక్రియను వేగవంతం చేయడానికి దోహదపడుతుంది. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం నుంచి బయట పడవచ్చు. ఈ సీజన్‌లో మలబద్దకం సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంది. కనుక గుమ్మడికాయలను తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు.


4. విటమిన్-సి గుమ్మడిలో పుష్కలంగా లభించడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగు పరచడానికి దోహదపడుతుంది. అదేవిధంగా గాయాలు తొందరగా మానుతాయి.


5. గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల జీర్ణాశయం, గొంతు, క్లోమం, రొమ్ము క్యాన్సర్ వంటి వాటిని దరిచేరనివ్వదు. క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.


6. చలి కాలంలో గుమ్మడికాయలను తరచూ తినడం వల్ల ఎలాంటి గొంతు, జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతోపాటు షుగర్, బీపీ సమస్యల నుంచి బయట పడేందుకు గుమ్మడికాయలు సహకరిస్తాయి.

No comments

Powered by Blogger.