Latest

Loading...

Raisins with Milk: మలబద్ధకం, ఎముకల సమస్యలతో ఇబ్బందిపడేవారు రోజూ ఈ పాలను తాగితే అద్భుత ఫలితం.....!!

Raisins with Milk

 Raisins with Milk: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన అనంతరం ఎక్కువమంది రోజు తినే ఆహారంలో డ్రై ఫ్రూట్స్ ని చేర్చుకున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి.


ముఖ్యంగా ఎండు ద్రాక్ష మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ద్రాక్షలో ఎన్ని మంచి పోషకాహర విలువలు కలిగి ఉన్నాయో.. అంతే స్థాయిలో ఎండు ద్రాక్షలో కూడా పోషకార విలువలున్నాయి. కొన్ని రకాల వ్యాధులు సోకినప్పుడు.. అనేక వ్యాధులను నయం చేసేందుకు ఇవి ఉత్తమ ఆహారంగా ఉపయోగపడుతాయని ఆరోగ్య నిపుణులు చెప్పారు. ముఖ్యంగా రోజూ రాత్రి పాలు, కిస్మిస్ కలిపి తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయి. ఒక గ్లాస్ పాలు తీసుకుని దానిలో ఏడు కిస్మిస్‌లను కొంచెం బెల్లం వేసుకుని మరిగించి రోజూ రాత్రి నిద్రపోయే ముందు తాగాలి. ఈ కిస్మిస్ పాలు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..


*మలబద్దకంతో బాధపడేవారికి మంచి రిలీజ్ ని ఇస్తుంది. మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది.

*జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా గ్యాస్‌, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

*ఈ పాలు కంటి చూపుని మెరుగుపరుస్తాయి. రేచీకటి, గ్లకోమా, శుక్లాలు వంటి సమస్యలు రాకుండా నిరోధించవచ్చు.

*ఈ పాలల్లో కాల్షియం అధికం. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా మారుతాయి. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.

*ఈ పాలు గుండెను పదిలంగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్, బీపీలు నియంత్రణలో ఉంటాయి.

*నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది.

*అలసటగా, నీరసంగా ఉన్నవారు కిస్మిస్ పాలను తాగితే తక్షణ శక్తినిస్తుంది. చురుగ్గా పనిచేస్తారు.

*రక్తహీనత ఉన్నవారికి ఈ కిస్మిస్ పాలు మంచి మెడిసిన్.

*ఈ పాలల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మంచి మెరుపునిస్తాయి. చర్మంపై ముడతలు, మచ్చలను తగ్గిస్తాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.

No comments

Powered by Blogger.