Latest

Loading...

Regularize All Teachers టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేస్తం..!!

Regularize All Teachers

 అమృత్‌సర్: తాము అధికారంలోకి వస్తే పంజాబ్‌లో కాంట్రాక్టు బేస్‌లో పనిచేస్తున్న టీచర్లందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు.


వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీచర్లను ఆకట్టుకునేందుకు ఎనిమిది హామీలను ప్రకటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పంజాబ్‌లో పర్యటిస్తున్న కేజ్రీవాల్‌.. రెండోరోజు అమృత్‌సర్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఏ సమాజంలోనైనా టీచర్ల పాత్ర కీలకమైనదని కేజ్రీవాల్ తెలిపారు. పంజాబ్‌లోని టీచర్లతో నెలరోజులుగా తాను మాట్లాడుతున్నానని, ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో 2.4 మిలియన్ల స్టూడెంట్లు చదువుతున్నారని, వారి భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని స్కూళ్లలో టీచర్లు లేరని తన దృష్టికి వచ్చిందని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో తెచ్చినట్టుగానే పంజాబ్‌లోని స్కూల్స్‌లో కూడా సంస్కరణలు తెస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఆప్‌ అధికారంలోకి వచ్చే సమయానికి అక్కడి స్కూల్స్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండేవని, ఏడేండ్లలో వాటిని డెవలప్ చేశామని తెలిపారు.


కేజ్రీవాల్ ఇచ్చిన 8 హామీలు:


టీచర్లందరికీ సరైన పని వాతావరణాన్ని కల్పిస్తాం

కాంట్రాక్టు టీచర్లందరినీ రెగ్యులర్‌ చేస్తాం

ట్రాన్స్‌ఫర్లు పారదర్శకంగా జరిగేలా పాలసీ తెస్తాం

టీచర్లు ఎవరికీ నాన్‌ టీచింగ్ బాధ్యతలు అప్పగించం

పంజాబ్‌లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా టీచర్లు నిరుద్యోగులుగానే ఉన్నారు. టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం

విదేశీ లేదా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎమ్‌) వంటి మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్ల ద్వారా టీచర్లకు ట్రైనింగ్‌ ఇస్తాం

సరైన సమయానికి ప్రమోషన్లు

టీచర్లు, వారి ఫ్యామిలీలకు క్యాష్‌లెస్‌ మెడికల్ ఫెసిలిటీని అమలు చేస్తాం

No comments

Powered by Blogger.