SBI ATM Card : మీ దగ్గర ఈ ఏటీఎం కార్డు ఉంటే రూ.2 లక్షల వరకు ఫ్రీ బెనిఫిట్స్...!!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు తమ అకౌంట్‌పై వచ్చే బెనిఫిట్స్‌పై పూర్తి అవగాహన ఉండదు.
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్‌బీఐ తమ కస్టమర్లకు అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. వాటిలో ఉచితంగా ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ (Insurance Benefits) కూడా ఉన్నాయి. ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.2 లక్షల వరకు ఉచిత బీమా ప్రయోజనాలు ఉంటాయి. కార్డ్ హోల్డర్ మరణించిన తర్వాత వారి నామినీకి బీమా డబ్బులు లభిస్తాయి. 2018 ఆగస్ట్ 28 కన్నా ముందు అకౌంట్ ఓపెన్ చేసిన వారికి రూ.1 లక్ష, ఆ తర్వాత అకౌంట్ ఓపెన్ చేసినవారికి రూ.2 లక్షల యాక్సిడెంటల్ డెత్ కవరేజీ లభిస్తుంది. ఎస్‌బీఐ రూపే జన్ ధన్ కార్డ్ (SBI RuPay Jan Dhan Card) వాడుతున్నవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
జన్ ధన్ అకౌంట్ ప్రయోజనాల
నిరుపేదలు, తక్కువ వేతనం పొందుతున్నవారికి బ్యాంకింగ్ సేవల్ని అందించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ అకౌంట్ ఓపెన్ చేసినవారికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఓపెన్ చేసినవారికి ఉచితంగా ఏటీఎం కార్డు లభిస్తుంది. రూ.5,000 ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం ఉంటుంది. ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది.
జన్ ధన్ అకౌంట్‌కు మినిమమ్ బ్యాలెన్స్ నియమనిబంధనలు ఉండవు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బెనిఫిట్స్, నగదు పొందడానికి ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజీ రూ.2 లక్షల వరకు ఉంటుంది. అయితే ప్రమాదంలో మరణించడానికి 90 రోజుల ముందు ఆ కార్డుతో లావాదేవీలు జరిపి ఉండాలి. ఏటీఎం కార్డుతో నెలకు నాలుగు లావాదేవీలు ఉచితంగా జరపొచ్చు.
జన్ ధన్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి
ఈ స్కీమ్ పొందాలంటే కస్టమర్లు ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) అకౌంట్ ఓపెన్ చేయాలి. సమీపంలోని బ్రాంచ్‌కు వెళ్లి జన్ ధన్ అకౌంట్‌కు సంబంధించిన ఫామ్ పూర్తి చేయాలి. అకౌంట్ హోల్డర్ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లాంటి వివరాలతో కేవైసీ పూర్తి చేయాలి. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్ ఇవ్వొచ్చు. బ్యాంకు సిబ్బంది డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత ఖాతా తెరుస్తారు.
No comments