Latest

Loading...

SBI Customers Alert: తన కస్టమర్లకు షాకిచ్చిన ఎస్‌బీఐ.. డిసెంబర్‌ 1 నుంచి వీటిపై బాదుడు....!!

SBI Customers Alert

 SBI Customers Alert: తన కస్టమర్లకు షాకిచ్చిందిన స్టేట్‌ బ్యాక్‌ ఆఫ్‌ ఇండియా. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వాడే వారికి ఈ షాకింగ్‌ న్యూస్‌. క్రెడిట్‌ కార్డు ఈఎంఐ లావాదేవీలపై ఇక నుంచి రూ.99 ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేయనున్నట్లు ఎస్‌బీఐ ఇటీవల వెల్లడించింది.


అయితే ఈ ప్రాసెసింగ్‌ ఫీజు నిబంధనలు డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో కస్టమర్లకు మరింత భారం పడనుంది. అంతేకాదు ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు పన్ను కూడా వసూలు చేయనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ఈ-కామర్స్‌ సంస్థలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, రిటైల్‌ షాపుల ద్వారా కొనుగోలు చేసిన వస్తువులపై ఈఎంఐలపై రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు సంస్థ ఎస్‌బీఐ మెయిల్‌ పంపింది. మర్చంట్‌ ఔట్‌లెట్‌, వెబ్‌సైట్‌, యాప్‌లలో చేసే అన్ని రకాల ఈఎంఐ లావాదేవీలపై డిసెంబర్‌ 1 నుంచి రూ.99 ప్రాసెసింగ్‌ ఫీజు, పన్నులు వసూలు వర్తిస్తాయని తెలిపింది. ఎస్‌బీఐ కొత్త నిబంధనల కారణంగా కోట్లాది మంది వినియోగదారులపై అదనపు భారం పడనుంది.


ఈఎంఐలుగా మార్చుకున్న లావాదేవీలపైనే..


అయితే సాధారణంగా క్రెడిట్‌ కార్డులపై ఈఎంఐ లావాదేవీలపై బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తూ వ్యాపారస్థులే కస్టమర్లకు రాయితీలు ఇస్తున్నారు. ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి లావాదేవీలపైన డిసెంబర్‌1 నుంచి ప్రాసెసింగ్‌ ఫీజుతో పాటు ట్యాక్స్‌ వసూలు చేయనుంది. ఈఎంఐలుగా మార్చుకున్న లావాదేవీల పైనే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత లావాదేవీ విఫలమైతే ఫీజు తిరిగి ఇచ్చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ముందుగానే ఉపయోగించిన లావాదేవీ ఈఎంఐలు డిసెంబర్‌ తర్వాత ప్రారంభం అవుతుంటే దానిపై ప్రాసెసింగ్ ఫీజు అంటూ ఏమీ ఉండదు. కానీ రివార్డు పాయింట్లు మాత్రం ఇవ్వరు. అయితే వసూలు చేస్తున్న ప్రాసెసింగ్‌ ఫీజు ఈఎంఐలలోనే కలిసే ఉంటుందని తెలుస్తోంది.




No comments

Powered by Blogger.