Latest

Loading...

Sleep and Diabetes: నిద్ర సరిపోకపోతే డయాబెటిస్ వచ్చే ఛాన్స్.....!!!

Sleep and Diabetes

 శారీరక ఆరోగ్యంతో పాటూ మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో నిద్రదే ముఖ్యపాత్ర. ఒక్కరోజు సరిగా నిద్రపోకపోయినా ఆ రోజంతా నీరసంగా, మూడీగా ఉంటుంది. సరిగా దేనిపైనా ఏకాగ్రత పెట్టలేం.

అలాంటిది రోజుల కొద్దీ నిద్ర తగ్గిపోతే ఆ ప్రభావం శరీరంపై, మెదడుపై ఎంతగా పడుతుందో ఓసారి ఆలోచించండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సగటు మనిషి ఎనిమిది గంటలు నిద్రపోవాలని సూచిస్తోంది. మీలో ఎంత మంది రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోతున్నారు? సర్వే ప్రకారం చాలా తక్కువ శాతం మందే ఎనిమిది గంటలు నిద్రపోతున్నారు. మిగతావారంతా అయిదు నుంచి ఏడు గంటల మధ్య నిద్రతో సర్దుకుపోతున్నారు. లండన్ కు చెందిన ట్రినిటీ కాలేజీ ప్రొఫెసర్ చెప్పిన ప్రకారం నిద్రలేమికి, అనారోగ్యానికి మధ్య దగ్గర సంబంధం ఉంది. ఆ రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి.


నిద్రలేమితో డయాబెటిస్

నిద్రలేమిపై ఇప్పటికీ చాలా అధ్యయనాలు అయ్యాయి. దాదాపు 50 లక్షల మందిపై ఈ పరిశోధనలు సాగాయి. వాటన్నింటిలోనూ నిద్ర తక్కువైతే మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు పెరగడం, ఊబకాయం వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టు బయటపడింది. ముఖ్యంగా యుక్తవయసులో ఉన్న వారు చాలా రాత్రులు తక్కువ నిద్రతోనే సరిపెట్టుకుంటే వారికి భవిష్యత్తులో మధుమేహం వచ్చ అవకాశం చాలా ఎక్కువని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలేమి వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించే సామర్థ్యం దెబ్బతింటుంది. రోగనిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల డయాబెటిస్ త్వరగానే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థరాత్రి వరకు మెలకువగా ఉండే కన్నా... రాత్రి పదిలోపు నిద్రపోయి ఉదయం ఏడులోపు లేస్తే చాలు. వారి ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. నిద్రలేమి సమస్య దరిచేరదు.


మెదడుపై ప్రభావం

నిద్రలేమి ప్రభావం మెదడుపై కూడా తీవ్రంగానే పడుతుంది. ప్రతిరోజు మన మెదడులో చాలా వ్యర్ధకణాలు ఉత్పత్తి అవుతాయి. అవి తొలగిపోవాలంటే నిద్రచాలా అవసరం. మనం నిద్రవస్థలో ఉన్నప్పుడే ఆ వ్యర్ధకణాలను మెదడు వదిలించుకుంటుంది. మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది. నిద్రలేమి మాత్రమే కాదు అతినిద్రతో కూడా మెదడుకు నష్టమే. అతనిద్రవల్ల జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. కాబట్టి నిద్రను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.

No comments

Powered by Blogger.