Latest

Loading...

Third dose మధుమేహులకు మూడో డోసు.....!!

Third dose

కొవిడ్‌-19 వల్ల మధుమేహ వ్యాధిగ్రస్థులకు పొంచి ఉన్న ఇబ్బందుల దృష్ట్యా వారందరికీ టీకాలు ఇవ్వాలని భారత వైద్య సంఘం (ఐఎంఏ) డిమాండ్‌ చేసింది.


అవసరమైతే వారికి మూడో డోసు కూడా ఇవ్వాలంది. ప్రపంచ మధుమేహ దినాన్ని పురస్కరించుకొని ఈ సంఘం ఆదివారం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. మధుమేహాన్ని త్వరగా గుర్తించడం, ఆ రుగ్మత వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వాకాథాన్, మారథాన్, స్క్రీనింగ్‌ క్యాంప్‌లు వంటివి నిర్వహించింది. ఈ రుగ్మతపై పరిశోధన పత్రాలు ఎక్కువగా వెలువరించేలా యువ వైద్యులను ప్రోత్సహించడం, బాధితులకు ఆసుపత్రుల్లో సమర్థ చికిత్స వంటి వాటిపైనా దృష్టిసారించింది. 10 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమం 100 కోట్ల మందికి చేరాలన్నది తమ లక్ష్యమని ఐఎంఏ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐడీఎఫ్‌ డయాబెటిస్‌ అట్లాస్‌ ప్రకారం.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 67 లక్షల మంది మధుమేహంతో చనిపోయారు. 20-79 ఏళ్ల మధ్య వయసున్నవారిలో 53.7 కోట్ల మంది ఈ రుగ్మతతో బాధపడుతున్నారు. 2030 నాటికి ఆ సంఖ్య 64.3 కోట్లకు, 2045 నాటికి 78.4 కోట్లకు పెరగొచ్చు. భారత్‌లో 7.7 కోట్ల మంది మధుమేహంతో జీవిస్తున్నారు. 2045 నాటికి ఆ సంఖ్య 13.4 కోట్లకు చేరవచ్చని అంచనా

No comments

Powered by Blogger.