UAN-Aadhar Linking: నవంబర్ 30 లోపు యూఏఎన్, ఆధార్ లింక్ చేయండి.. లేదంటే డబ్బులు జమ కావు...!!
మీ ఈపీఎఫ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)కు ఆధార్ కార్డును అనుసంధానం ఇంకా చేయలేదా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే! నవంబర్ 30లోగా యూఏఎన్‌తో ఆధార్‌ను లింక్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
లేదంటే కంపెనీ మీ ఖాతాలో జమ చేసే మొత్తం ఆగిపోతుంది. అంతేకాదు, పీఎఫ్‌లోని డబ్బును అవసరానికి విత్‌డ్రా చేసుకొనేందుకు అవకాశం కోల్పోతారు. పైగా ఈపీఎఫ్‌వో అందించే అన్ని రకాల సేవలనూ నిలిపివేస్తారు.
ఇలా చేసుకోండి
మొదట ఈపీఎఫ్‌వో వెబ్‌పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ కు లాగిన్ అవ్వాలి.
మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌తో మీ అకౌంట్‌కు లాగిన్ అవ్వండి.
మేనేజ్ సెక్షన్‌లోని కేవైసీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
పేజీ ఓపెన్ అవ్వగానే మీ ఈపీఎఫ్‌వోను ఇతర సేవలకు లింక్ చేసే ఆప్షన్లు కనిపిస్తాయి.
ఆధార్ ఆప్షన్ ఎంపిక చేసుకొని ఆధార్ నంబర్ టైప్ చేయండి. మీ పేరు జత చేసి సేవ్ కొట్టండి.
మీ పొందుపర్చిన సమాచారం అంతా సేవ్ అవుతుంది. యూఐడీఏఐ డేటాతో వెరిఫై చేస్తుంది.
కేవైసీలో మీరిచ్చిన సమాచారం సరైందే అయితే ఆటోమేటిక్‌గా ఈపీఎఫ్‌తో లింక్ అవుతుంది.
మీ ఆధార్ వెరిఫై సమాచారం మీ ముందు కనిపిస్తుంది.
యూఏఎన్ ఉపయోగాలివీ
ఈపీఎఫ్‌వోలో ఉద్యోగి నమోదు అవ్వగానే అతడు భవిష్యనిధి సభ్యుడు అవుతాడు. అతడికి 12 అంకెల యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్) కేటాయిస్తారు. ఈ సంఖ్య సాయంతోనే ఈపీఎఫ్‌వో అన్ని సేవలను మీరు పొందేందుకు అవకాశం ఉంటుంది. పీఎఫ్ ఖాతాను, ఖాతా పుస్తకాన్ని ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇది ఉపయోగపడుతుంది. నామినీ నమోదు చేసుకోవచ్చు.
ఈపీఎఫ్ తెలుసు కదా!
ఈపీఎఫ్‌వో ఖాతాలో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం, యజమాని నుంచి 12 శాతం జమ అవుతుందన్న సంగతి తెలిసిందే. యజమాని కోటాలోంచే 3.67 శాతం పీఎఫ్ ఖాతాలో జమ అయితే మిగతా 8.33 శాతం ఉద్యోగి పింఛను పథకం (EPS)లోకి వెళ్తుంది.
No comments