Viral స్మార్ట్ క్లాస్‌రూమ్‌ని తయారు చేసేందుకు ఈ టీచర్ తన నగలను అమ్మేసింది తెలుసా...!!
ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేవు, దీంతో విద్యార్థుల చదువు కుంటుపడుతుందని పలుమార్లు వినిపిస్తోంది. అదనపు నిధులు ఇవ్వాలని పదే పదే కోరుతున్నా సకాలంలో మంజూరు చేయడం లేదు.
కానీ ప్రభుత్వం నుండి సహాయం కోసం ఎదురుచూడకుండా, తమిళనాడుకు చెందిన ఒక ప్రాథమిక ఉపాధ్యాయరాలు స్మార్ట్‌క్లాస్‌ల నిర్మాణానికి అయ్యే ఖర్చును తీర్చడానికి తన సొంత నగలను విక్రయించింది.
తమిళనాడులోని విల్లుపురంలోని పంచాయతీ యూనియన్ ప్రైమరీ స్కూల్‌లో మూడో తరగతి టీచర్ అన్నపూర్ణ మోహన్ స్కూల్ కి వరల్డ్ క్లాస్ లుక్ తీసుకువచ్చారు. పంచాయితీ యూనియన్ ప్రాథమిక పాఠశాలలోని ఏ తరగతి గది చూసిన స్మార్ట్ బోర్డు, సౌకర్యవంతమైన ఫర్నిచర్, ఆంగ్ల పుస్తకాలు వారి తరగతి గదిలో అందుబాటులో ఉన్నాయి.
ఇక్కడ హైటెక్ సౌకర్యాలు ఉండటమే కాకుండా, ఈ టీచర్ తన విద్యార్థులు ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలరని చెబుతున్నారు. అన్నపూర్ణ మాట్లాడుతూ, 'నేను నా తరగతి గదిలో ఇంగ్లీష్ కోసం మంచి వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నించాను. మొదటి నుండి చివరి వరకు, నేను తరగతిలోని పిల్లలతో ఆంగ్లంలో మాత్రమే మాట్లాడతాను. మొదట్లో కొంత మంది పిల్లలకు అర్థం కాకపోయినా తర్వాత స్పందించడం మొదలుపెట్టారు అని చెప్పకొచ్చింది.
పిల్లల చదువులు ఆసక్తికరంగా ఉండేలా షార్ట్ స్కిట్‌ల సాయం తీసుకుంది. అనంతరం విద్యార్థుల ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో మంచి స్పందన వచ్చింది.
No comments