Latest

Loading...

Vitamin B12: మీ కాలి వేళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా..! అయితే విటమిన్ B12 లోపం....చాలా డేంజర్‌.....!!!

 

Vitamin B12

Vitamin B12: శరీరానికి అన్ని విటమిన్లతో పాటు బి12 కూడా చాలా ముఖ్యం. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. B12 లోపం ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే వీలైనంత త్వరగా చికిత్స పొందాలి.

ఆలస్యమైతే రక్తహీనత వంటి కోలుకోలేని వ్యాధికి గురికావాల్సి ఉంటుంది. ఆహారంలో ద్వారా తగినంతగా ఈ విటమిన్‌ తీసుకోకపోవడం ద్వారా విటమిన్ B12 లోపం ఏర్పడుతుంది. ప్రధానంగా విటమిన్ B12 పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, చేపలలో ఉంటాయి, శాకాహారి వ్యక్తులు విటమిన్ B12 సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా లేదా పోషకాలతో కూడిన ఆహారాన్ని తినడం ద్వారా కవర్‌ చేయవచ్చు.


విటమిన్ B12 లోపం లక్షణాలు

డిప్రెషన్, మానసిక సామర్థ్యం క్షీణించడం, అలసట, మెమరీ సమస్యలు, పాలిపోయిన చర్మం, నడవడంలో ఇబ్బంది, మూడ్ ఛేంజ్‌ కావడం, ఊపిరి ఆడకపోవడం, తలతిరగడం, చెదిరిన దృష్టి, నోటి పూతలు,

తిమ్మిరి ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తరచుగా కాలి వేళ్లల్లో, చేతుల్లో తిమ్మిరి ఏర్పడితే ఇది విటమిన్ B12 లోపాన్ని సూచిస్తుంది.


విటమిన్ B12 స్థాయిలను తనిఖీ చేయడానికి సాధారణ రక్త పరీక్షలు చేయించుకోవాలి. గుడ్లు, డైరీ, సాల్మన్, ట్రౌట్, గొడ్డు మాంసం, సార్డినెస్, జంతువుల కాలేయం, మూత్రపిండాలలో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. విటమిన్ B12 నాడీ వ్యవస్థకు మద్దతు ఇస్తుంది DNA తయారీలో సహాయపడుతుంది.



No comments

Powered by Blogger.