Latest

Loading...

Weather Alert ఏపీ, తమిళనాడులో రెడ్ అలెర్ట్: 48గంటల్లో మరో ఉపద్రవం...!!!

Red Alert

 ఏపీలో భారీ వర్షాలు తగ్గేలా కనిపిం చడం లేదు. గత పదిరోజులుగా వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసాయి. ఈ భారీ వర్షాలకు ఏపీలోని అనేక జిల్లాలతో పాటూ చెన్నై నగరం కూడా తీవ్రంగా నష్టపోయింది


ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో వందలాది ఎకరాల్లో వరినాట్లు నీట మునిగాయి. ఉద్యాన పంటలు సైతం దెబ్బతిన్నాయి. గత పదిరోజుల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలకు జనం అల్లాడిపోగా.. ఇప్పుడు మరో ఉపద్రవం ముంచుకొస్తోంది. ఈ ఉపద్రవంతో ఏపీతో పాటూ తమిళనాడులోనూ రెడ్ అలెర్ట్ ప్రకటించారు.


బంగాళాఖాతంలో తాజాగా ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారుతోంది. ఈ వాయుగుండం తుఫాన్ గా మారితే దానికి జవాద్ గా పేరు పెట్టాలని ముందే డిసైడ్ అయ్యారు. ఈ వాయుగుండం కారణంగా ప్రస్తుతానికి రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా భారీగా ఈదురు గాలులు వీచే అవకాశం కూడా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో అధికారులు ఇప్పటికే అలెర్ట్ అయ్యారు. ప్రత్యేక చర్యలు చేపట్టారు. మత్స్యకారులను కూడా వేటకు వెళ్లవద్దని సూచించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేలా చూడాలని ఇప్పటికే అధికారులు స్థానిక సిబ్బందికి ఆదేశాలిచ్చారు.


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రమై, వాయుగుండంగా మారి ప్రస్తుతం దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు ప్రాంతానికి చేరుకుంది. అయితే ఇది తుఫాన్ గా మారే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కేవలం బలమైన అల్పపీడనం లేదా డిప్రెషన్ మాత్రమే తీరాన్ని తాకుతుందని చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ లోని దక్షిణ మరియు మధ్య ప్రాంతాలలో రేపటినుంచి తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చెరువులు పూర్తిగా నిండిపోయివున్నాయి కాబట్టి.. వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు భయపడుతున్నారు. ఒకవేళ అదే జరిగితే ఏపీలోని పలు జిల్లాలు వరద భీభత్సానికి గురికాక తప్పదు. వాయుగుండం తుఫాన్ గా మారే విషయంపై మరో 48 గంటల్లో పూర్తి స్థాయిలో ఓ అంచనా ఏర్పడనుంది

No comments

Powered by Blogger.